Cricket: ‘వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లే ఎక్కువ’

ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. లార్డ్స్ స్డేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ ఎంచుకుని వర్షం కారణంగా అరగంట ఆలస్యం మ్యాచ్ ను మొదలుపెట్టింది.

Cricket: ‘వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లే ఎక్కువ’

Cricket: ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. లార్డ్స్ స్డేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ ఎంచుకుని వర్షం కారణంగా అరగంట ఆలస్యం మ్యాచ్ ను మొదలుపెట్టింది. తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి చక్కటి ఆరంభాన్నే నమోదుచేసింది.

97పరుగుల భాగస్వామ్యంతో వరల్డ్ కప్ విన్నర్ ఫిలిప్ సాల్ట్ (60), జేమ్స్ విన్స్ (56)లతో ఇంగ్లాండ్ జట్టుకు ఊతమందించారు. అంతే ఒత్తిడి పెరుగుతుండటంతో పాకిస్తాన్ బౌలర్ల చేతివాటం నీరుగారింది. ఫలితంగా 247పరుగులు చేసిన ఇంగ్లీష్ జట్టు.. పాకిస్తాన్ ను 195పరుగులకే కట్టడం చేసి 52పరుగుల తేడాతో మ్యాచ్ ముగించారు.

ఈ పర్‌ఫార్మెన్స్‌లో స్వదేశ జట్టుపై షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. షాహీన్ అఫ్రీది ప్రదర్శనను విమర్శిస్తూ అతను వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్ లు, హగ్స్ తోనే సెలబ్రేషన్స్ ఎక్కువ జరుపుకున్నాడు.

వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్ లకే సమయం కేటాయించాడు షాహీన్ అఫ్రీది. ఫ్లైయింగ్ కిస్ లు, హగ్ లు కంటే ముందు కనీసం ఐదు వికెట్లు లేదా బ్యాటింగ్ లైనప్ మెరుగుచేస్తే బాగుండేది. ఒక్క వికెట్ పడగొట్టగానే ఇలా చేయడం వెనుక పాయింట్ ఏముంది’

‘టీం సరిగా రెడీ అవలేదనే సాకులు చెప్పొద్దు. మ్యాచ్ కు రెండున్నర రోజులు ముందే ఇంగ్లాండ్ జట్టు అక్కడికి వచ్చారు. వారంతా కలిసి జట్టుగా ఆడగలిగారు. మీరు 30రోజులు ఒకేచోట ఉన్నా కూడా ఆడలేకపోయారు. ఇంగ్లాండ్ అకాడమీ టీంతోనే ఓడిపోయారు’ అని అఫ్రీది అన్నారు.