Yash Dayal: సోషల్ మీడియాలో యశ్ దయాల్ వివాదాస్పద పోస్ట్.. ఆ వెంటనే డిలీట్.. సారీ చెప్పినా..
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వివాదాస్పద కథనాన్ని పోస్ట్ చేశాడు. దీంతో నెటింట్ట అతడిపై విమర్శల జడివాన మొదలైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో కొద్దిసేపటికే తన తప్పును గ్రహించిన యశ్ దయాల్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు.

Yash Dayal
Dayal: గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వివాదాస్పద కథనాన్ని పోస్ట్ చేశాడు. దీంతో నెటింట్ట అతడిపై విమర్శల జడివాన మొదలైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో కొద్దిసేపటికే తన తప్పును గ్రహించిన యశ్ దయాల్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయినప్పటికీ ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. తాను కావాలని ఆ పోస్ట్ ను చేయలేదని, పొరబాటు జరిగినట్లు ఒప్పుకుంటూ, తన తప్పును క్షమించాలని మరో పోస్ట్‌ను చేశాడు యశ్ దయాల్.
ఏం పోస్ట్ చేశాడంటే..?
లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని యశ్ దయాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యువతి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఓ వ్యక్తి తన వీపు వెనుక చాకును దాచి పెట్టుకుని ఆమెకు ప్రపొజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే సమాధులు ఉండగా మరో మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహం పై సాక్షి అని వ్రాసి ఉంది.
King Yash Dayal 👑 pic.twitter.com/zVrH2nlxDt
— izna / इज्ना (@iz_naaah) June 5, 2023
అయితే ఈ పోస్ట్‌ను క్రికెటర్ వెంటనే తొలగించాడు. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. పలువురు దీన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతడిని విమర్శిస్తున్నారు. ఆ వెంటనే యశ్ దయాల్ మరో పోస్ట్ చేశాడు. ‘పొరబాటున ఆ కథనాన్ని పోస్ట్ చేశాను దయచేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు.’ అంటూ నెటిజన్లను కోరాడు. ‘థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది.’ అంటూ రాసుకొచ్చాడు.

Yash Dayal instagram story
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో యశ్ దయాల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఓ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు అద్భుతం విజయాన్ని అందించాడు. ఆ సమయంలో అందరూ యశ్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతి క్రికెటర్ జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని, దీన్ని నుంచి పాఠాలు నేర్చుకుని బలంగా తిరిగి రావాలి తప్పిస్తే నిరాశ పడకూడంటూ ప్రతి ఒక్కరు అతడి ధైర్యాన్ని చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ మ్యాచ్ తరువాత గుజరాత్ ఆడిన మరో తొమ్మిది మ్యాచుల వరకు అతడికి జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు ఓ పోస్ట్‌తో అతడిపై ఉన్న సానుభూతిని కోల్పోయాడు.