IND vs AUS 4th Test Match: నాల్గోరోజు తొలి సెషన్ కీలకం.. అదేజరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇండియా

నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్‌లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి.

IND vs AUS 4th Test Match: నాల్గోరోజు తొలి సెషన్ కీలకం.. అదేజరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇండియా

IND vs AUS 4th Test Match

IND vs AUS 4th Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతుంది. ఇవాళ నాల్గోరోజు ఆట ప్రారంభమవుతుంది. మూడోరోజు ఆటలో టీమిండియా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆస్ట్రేలియాకు దీటుగా వికెట్లు కోల్పోకుండా పరుగులు రాబట్టింది. ఫలితంగా మూడోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. కోహ్లీ (59), జడేజా (16) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (480)కంటే 191 పరుగులు ఇండియా వెనుబడి ఉంది. నాల్గో టెస్టులో భారత్ జట్టుకు విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే నేడు జరిగే ఆటకీలకం కానుంది.

IND vs AUS 4th Test 2023: ముగిసిన మూడో రోజు ఆట.. గిల్ సెంచరీ, కోహ్లీ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు 289/3..

నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్‌లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి. పిచ్ ఇప్పటికి బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. అయితే, నాల్గోరోజు ఆట కొనసాగే కొద్దీ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు కోహ్లీ సెంచరీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 136 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ 28వ టెస్టు సెంచరీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ, జడేజా తరువాత శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎస్ భరత్, అక్షర్ పటేల్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఆశించొచ్చు. వీరిలో కీలక భాగస్వామ్యం సాధ్యమైతే ఆసీస్ జట్టును ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. స్వదేశంలో ఆ మైలురాయి దాటిన ఐదో ఆటగాడిగా ఘనత

ఒకవేళ అహ్మదాబాద్ టెస్టు డ్రా అయినా, లేదా ఓడినా టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్‌కు ఆశలు సన్నగిల్లే వకాశాలు ఉన్నాయి. ఇదేజరిగితే శ్రీలంక – న్యూజిలాండ్ సిరీస్ ఫలితాలపైనే ఇండియా ఆధారపడాల్సి వస్తుంది. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏదైనా ఒక మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు గెలిస్తే లేదా డ్రా అయితే అప్పుడు టీమిండియా డబ్ల్యూటీసీకి అవకాశం దక్కించుకుంటుంది.

డబ్ల్యూటీసీ పాయింట్ పట్టిక (2021 – 2023)

ఆస్ట్రేలియా – 68.52శాతం పాయింట్లు
టీమిండియా – 60.29 శాతం పాయింట్లు
దక్షిణాఫ్రికా – 55.56 శాతం పాయింట్లు
శ్రీలంక – 53.33 శాతం పాయింట్లు