IND vs NZ: స్పైడర్ కెమెరాపై విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ స్పెషల్ రియాక్షన్స్

భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది.

IND vs NZ: స్పైడర్ కెమెరాపై విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ స్పెషల్ రియాక్షన్స్

Ind Vs Nz

IND vs NZ: భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతోంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. మయాంక్ అగర్వాల్ సెంచరీ, పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ పటేల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

మూడో రోజు ఆటలో స్పైడర్ కెమెరా పిచ్ లో ఓ సరదా సీన్ క్రియేట్ అయ్యేందుకు కారణమైంది. ఇండియన్ ప్లేయర్ల రియాక్షన్స్ అందులో రికార్డు అయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్ బలంగా కెమెరాను పైకి నెట్టాలని ప్రయత్నిస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘నీ ఒరిజినల్ పొజిషన్ కు పో’ అంటూ సింగిల్ వార్నింగ్ ఇచ్చాడు.

వారితో పాటు శ్రేయాస్ అయ్యర్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డ్ సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్లు సైతం క్లోజప్ లో రికార్డ్ అయ్యాయి. బీసీసీఐ ఇదే వీడియోను షేర్ చేసింది. ‘హే స్పైడీ దూరంగా పో.. ‘ అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోను పోస్టు చేశాడు.

…………………………………… : చిట్టీల పేరుతో రూ.7 కోట్లు మోసం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా మూడో రోజు ఆటలో 276/7 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజీలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసింది. ఇంకా 4వందల రన్స్ వెనుకబడి ఉంది.