మరోసారి మెరిసిన యశస్వి: ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లా ఆధిపత్యం

  • Published By: vamsi ,Published On : February 9, 2020 / 12:09 PM IST
మరోసారి మెరిసిన యశస్వి: ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లా ఆధిపత్యం

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ మరోసారి అద్భుతంగా రాణించాడు.  క్లిష్టపరిస్థితుల్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ పోరులో యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్‌) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్‌ మెరుగైన స్కోరు చేసింది.  ఆరంభంలో తిలక్‌వర్మ(38: 65 బంతుల్లో 3ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ అందించాడు. అయితే మిగిలినవారు పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. 

చివరిగా ధ్రేవ్‌ జురేల్‌(22) ధ్రేవ్‌ జురేల్‌(22) అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మంచి స్కోరు చేసే అవకాశం మిస్సయ్యింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు మెరుగైన ఆటతీరుతో భారత్‌పై ఆధిపత్యం చలాయించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆఖరి వరకు బౌలర్లు క్రమశిక్షణతో బంతులేయగా భారత జట్టు స్కోరు బోర్డు పెద్దగా కదలలేదు. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌(3/40), ఇస్లాం(2/31), హసన్‌ షకీబ్‌(2/28) భారత్‌ను భారీ దెబ్బకొట్టారు.

టోర్నీ మొత్తం రాణించిన జైస్వాల్.. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సెంచరీ దిశగా దూసుకెళ్లినా.. ఇస్లాం బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత అండర్‌-19 వరల్డ్‌కప్‌లో 133 సగటుతో 400 పరుగులను సాధించాడు జైశ్వాల్‌. అందులో నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం ఉంది.