WTC Final 2023:ఈ సీనియర్ ఆటగాడు సెంచరీ చేస్తే.. గెలుపు టీమ్ఇండియాదే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ శతకం చేస్తేనా..!
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) కు వేళైంది. బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి.

Kohli-Rahane-Pujara
WTC Final 2023-Ajinkya Rahane: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) కు వేళైంది. బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇప్పటికే ఇరు జట్లు వ్యూహ ప్రతివ్యూహాలను రచించాయి. చాలా కాలం(18 నెలలు) తరువాత సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే(Ajinkya Rahane) పునరాగమనం చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), కేఎల్ రాహుల్(KL Rahul), రిషబ్ పంత్(Rishabh Pant) వంటి ఆటగాళ్లు గాయాలతో దూరం కావడంతో తుది జట్టులో రహానేకు చోటు ఖాయం.
ఈ విషయం టీమ్ఇండియా అభిమానులకు ఆనందం కలిగించేదే. అజింక్యా రహానేకు విదేశాల్లో మంచి రికార్డే ఉంది. స్వదేశంలో 32 టెస్టులు ఆడిన రహానే 35.74 సగటుతో 1,644 పరుగులు చేశాడు. విదేశాల్లో 50 టెస్టులు ఆడి 40కిపైగా సగటుతో 3,287 పరుగులు చేశాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుండడం, అక్కడ రహానే రికార్డు మెరుగ్గానే ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశం.
Virat Kohli: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పలు రికార్డులపై విరాట్ కోహ్లి కన్ను.. అవేంటంటే..?
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రహానే శతకంతో చెలరేగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. చాలా కాలం తరువాత అతడు జట్టులోకి రావడం ఒక కారణం అయితే అసలైన కారణం వేరే ఉంది. అదేమిటంటే..? ఇప్పటి వరకు రహానే టెస్టుల్లో 12 శతకాలు బాదాడు. అతడు సెంచరీ చేసిన ఏ మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా ఓడిపోలేదు. 9 మ్యాచుల్లో భారత్ గెలవగా, 3 మ్యాచులు డ్రా అయ్యాయి.
India never lost a Test match whenever Ajinkya Rahane scored a century.
Can the birthday boy repeat it in the World Test Championship final? pic.twitter.com/MJCka7Rnnp
— CricTracker (@Cricketracker) June 6, 2023
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఒక్క బంతిని సరిగ్గా కనెక్ట్ చేసినా చాలు..
దీంతో రంజీట్రోఫితో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులో చోటు దక్కించుకున్న రహానే అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ భారీ శతకంతో చెలరేగాలని కోరుకుంటున్నారు. అజింక్యా రహానే చివరి ఐదు శతకాలు చేసిన సందర్భాల్లో టీమ్ఇండియా గెలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ సెంచరీ చేస్తే విజయం టీమ్ఇండియాదే అని అభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరీ అభిమానులు కోరుకుంటున్నట్లు రహానే శతకం చేస్తాడో లేదో చూడాలి మరీ.