T20 World Cup 2021: వార్మప్ మ్యాచ్‌కు వేళాయె.. ఇంగ్లాండ్‌తో ఇండియా

దశాబ్దానికి పైగా నిరీక్షణ.. మెగా ఈవెంట్ లో టోర్నీని ముద్దాడాలనే ఏళ్ల నాటి కాంక్షను తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.

T20 World Cup 2021: వార్మప్ మ్యాచ్‌కు వేళాయె.. ఇంగ్లాండ్‌తో ఇండియా

warmup match

T20 World Cup 2021: దశాబ్దానికి పైగా నిరీక్షణ.. మెగా ఈవెంట్ లో టోర్నీని ముద్దాడాలనే ఏళ్ల నాటి కాంక్షను తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఐసీసీ ఈవెంట్ లో తలపడేందుకు యూఏఈ వేదికగా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అధికారికంగా టోర్నీలో పాకిస్తాన్ తో ఓపెనింగ్ ఆడుతున్న టీమిండియా సోమవారం ఇంగ్లాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.

టీ20 వరల్డ్ కప్ 2021న ఇప్పటికే ప్రారంభం కాగా ఒమన్ – పపువా న్యూ గినియాలు, బంగ్లాదేశ్ – స్కాట్లాండ్ లు నాలుగు జట్లు రెండు మ్యాచ్ లు ఆడేశాయి. ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైడ్ రౌండ్ మ్యాచ్‌లతో పాటు జరిగే వార్మప్ మ్యాచ్ సోమవారం ఇంగ్లాండ్ తో జరగనుంది. దుబాయ్ క్రికెట్ స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తర్వాతి వార్మప్ మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడనుంది టీమిండియా.

పాకిస్తాన్, న్యూ జిలాండ్, అఫ్ఘనిస్తాన్, 2క్వాలిఫైయింగ్ లతో ఇండియా ఉండగా.. మరో వైపు ఇంగ్లాండ్.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లతో పాటు మరో క్వాలిఫైంగ్ జట్లతో తలపడాల్సి ఉంది.

………………………………………….. : పెళ్లైన నాలుగు నెలలకే ఇల్లు వదిలి పారిపోయిన భర్త

ఇరు జట్ల బృందాలు:
India: విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ

England: ఇయోన్ మోర్గాన్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, క్రిస్ జోర్డాన్, టిమల్ మిల్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్