Ind vs SL 3rd ODI: ఎట్టకేలకు ఒక్కటి.. పరువు మిగిలింది

ఎట్టకేలకు భారత్‌తో జరిగిన చివరి వన్డేతో ఆతిధ్య శ్రీలంక జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో.. మొదట టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా ఆట 50కి బదులుగా 47 ఓవర్లకు తగ్గించబడింది.

Ind vs SL 3rd ODI: ఎట్టకేలకు ఒక్కటి.. పరువు మిగిలింది

Ind Vs Sl 3rd Odi

Ind vs SL 3rd ODI: ఎట్టకేలకు భారత్‌తో జరిగిన చివరి వన్డేతో ఆతిధ్య శ్రీలంక జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో.. మొదట టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా ఆట 50కి బదులుగా 47 ఓవర్లకు తగ్గించబడింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 39వ ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని సాధించింది. చివరి మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక గౌరవాన్ని కాపాడుకుంది, కానీ సిరీస్ 2-1తో భారత్‌కు వెళ్లింది.

అవిష్కా, భానుకా అర్ధ సెంచరీలు:
భారత్‌పై విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్ బ్యాట్స్ మాన్ మినోద్‌ భానుక (7), చేతన్ సకారియా చేతిలో 7 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్న అవిష్క(76), రాజపక్సే(65)తో కలిసి మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరు రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించారు.

ధావన్‌ మళ్లీ సకారియాను బౌలింగ్‌కు తీసుకుని రాగా.. వరుస ఓవర్లలో రాజపక్సే, ధనంజయ డిసిల్వా(2)లను అవుట్‌ చేశాడు. తర్వాత రాహుల్‌ చహర్‌ షనక(0), అవిష్క, కరుణరత్నే(3)లను వెంటవెంటనే అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే క్రీజులో అసలంక(24), రమేశ్‌ మెండిస్‌ (15 నాటౌట్) కాసేపు నిలకడగా ఆడడంతో శ్రీలంక ఓటమిని తప్పించుకుంది. 39 ఓవర్లలోనే 227పరుగులు చేసి విజయం సాధించాడు.

నిరాశపరిచిన భారత బ్యాట్స్‌మెన్:
భారత కెప్టెన్, ఓపెనర్ బ్యాట్స్ మాన్ శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని 13 పరుగులలో మూడు ఫోర్లు కొట్టాడు, కాని దుష్మంత చమీరా అతన్ని క్యాచ్ అవుట్ చేశాడు. పృథ్వీ షా బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ 49 పరుగులకే అవుటయ్యాడు. తన అర్ధ సెంచరీని కోల్పోయి, దాసున్ షానకా చేతిలో lbw అవుట్ అయ్యాడు. తొలి వన్డేలో 46 బంతుల్లో 46 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడిన సంజు సామ్సన్ జయవిక్రమకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగులు చేసి అవుటైన మనీష్ పాండే రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్‌ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను కోల్పోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది.

సూర్యకుమార్ యాదవ్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 40 పరుగులు చేసి LBW అవుట్ అయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ 2 పరుగులు చేయగా, నితీష్ రానా 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది వారిద్దరి తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇద్దరూ నిరాశపరిచారు. రాహుల్ చాహర్ 13 పరుగులకు అవుటయ్యాడు. నవదీప్ సైనీ 15 పరుగులు చేసి అవుటయ్యాడు, భారత ఇన్నింగ్స్ 225 పరుగులకే ముగిసింది. 43.1ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు.

భారత్ తరఫున ఐదుగురు అరంగేట్రం:
మూడవ వన్డేలో టీమ్ ఇండియా తమ బెంచ్ బలాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ ద్వారా సంజు శాంసన్, నితీష్ రానా, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్ మరియు రాహుల్ చాహర్‌లకు భారత్ నుంచి వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. ఇది కాకుండా, మూడవ మ్యాచ్ కోసం టీమ్ ఇండియాలో మొత్తం 6 మార్పులు చేసింది. ఐదుగురు తొలి ఆటగాళ్లతో పాటు, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్, కుప్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, క్రునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వలేదు.

వర్షంతో ఆటకు ఆటంకం:
భారత్‌ ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ ముగిసిన తర్వాత స్టేడియాన్ని వర్షం ముంచెత్తింది. దాదాపు మ్యాచ్‌ గంటా 40 నిమిషాల సేపు ఆగిపోయింది. అంపైర్లు మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. డక్‌వర్త్‌ పద్ధతిలో భారత్‌కు ఒక పరుగును అదనంగా చేర్చారు. దాంతో లంక టార్గెట్‌ 227 పరుగులు అయ్యింది.