Asia Cup 2023 : భారత్ పాకిస్తాన్‌కు వెళ్లదు.. పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.

Asia Cup 2023 : భారత్ పాకిస్తాన్‌కు వెళ్లదు.. పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్

Asia Cup 2023 : వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఆసియా కప్ ను ఒకే తటస్థ వేదికలో నిర్వహించాలని పట్టుబడతామని ఆయన వెల్లడించారు. మా జట్టు పాకిస్తాన్ కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించ లేదన్నారు జైషా. కాగా, టీమిండియాను పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. బీసీసీఐ సెక్రెటరీ జైషా ఆ వార్తలను ఖండించారు.

భారత్‌, పాక్ లు తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ఈ రెండు జట్ల మధ్య చివరగా 2012 డిసెంబర్‌లో టీ20, వన్డే సిరీస్‌లు జరిగాయి. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అదే సమయంలో 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు పోటీ పడలేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భారత్ పర్యటించలేదు. అదే సమయంలో నియంత్రణ రేఖపై నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత ఈ సంబంధం మరింత దిగజారింది. రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా రెండు జట్లు ఆసియా కప్, ICC ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.