We Want A New Captain : కోహ్లీ దిగిపో..ట్రెండింగ్‌‌లో WeWantNewCaptain

టీమిండియా కెప్టెన్సీ మార్పు తథ్యమా ? మరోసారి కెప్టెన్సీ మార్పు అంశం తెరమీదకు వస్తోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ...సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

We Want A New Captain : కోహ్లీ దిగిపో..ట్రెండింగ్‌‌లో WeWantNewCaptain

Wewantnewcaptain

We Want A New Captain: టీమిండియా కెప్టెన్సీ మార్పు తథ్యమా ? మరోసారి కెప్టెన్సీ మార్పు అంశం తెరమీదకు వస్తోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ…సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. wtc ఫైనల్లో భారత్ ఘోరపరాజయం పాలు కావడం క్రీడాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పేలవమైన ఆట తీరు ప్రదర్శించడంతో కెప్టెన్ కోహ్లీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియిన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ – భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ పై 8 వికెట్ల తేడాతో కివీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీయే కారణమని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడంతో తెగ వైరల్ గా మారాయి. కోహ్లీపై వేటు వేసి..రోహిత్ శర్మకు పగ్గాలు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జట్టు ఎంపిక దగ్గరి నుంచి..ఫీల్డింగ్ మార్చడం, బౌలింగ్ లో మార్పులు, చేర్పులు చేయడం వంటి వాటిల్లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యారని, చెత్త బ్యాటింగ్ కూడా కారణమని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక టీమిండియా కోచ్ రవిశాస్త్రిపై కూడా విరుచుకపడుతున్నారు. కోహ్లీతో పాటు రవిశాస్త్రిపై కూడా వేటు వేయాలనే మరో డిమాండ్ వినిపిస్తోంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమిస్తే..కనీసం టీ 20 ప్రపంచ కప్ గెలిచే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ICC ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.