Ravi Shastri – Audi: రవిశాస్త్రి గెలిచిన అవార్డు.. 35ఏళ్ల పాత ఆడి కార్

క్రికెట్‌కు.. ఆటోమొబైల్స్ కు చాలా ఏళ్లుగా సుదీర్ఘ సంబంధమే ఉంది. క్రికెట్ తొలి రోజుల నుంచే లగ్జరీ కార్లకు క్రికెటర్లకు ఉన్న రిలేషన్ కొనసాగుతూ ఉంది. దశాబ్దాల క్రితమే ...

Ravi Shastri – Audi: రవిశాస్త్రి గెలిచిన అవార్డు.. 35ఏళ్ల పాత ఆడి కార్

Indias Most Famous Audi Is 35 Years Old Belongs To Ravi Shastr

Ravi Shastri – Audi: క్రికెట్‌కు.. ఆటోమొబైల్స్ కు చాలా ఏళ్లుగా సుదీర్ఘ సంబంధమే ఉంది. క్రికెట్ తొలి రోజుల నుంచే లగ్జరీ కార్లకు క్రికెటర్లకు ఉన్న రిలేషన్ కొనసాగుతూ ఉంది. దశాబ్దాల క్రితమే ఇండియన్ క్రికెట్ ప్రస్తుత కోచ్.. మాజీ ప్లేయర్ రవి శాస్త్రి ఆడి గెలుచుకున్నారు. ఇప్పటికీ ఆ కారును వర్కింగ్ కండీషన్ లో వాడుతూనే ఉన్నారు.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆడి 100ను గెలుచుకున్నారు రవి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నమెంట్ అది. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో రవిశాస్త్రి పర్‌ఫార్మెన్స్‌కు అవార్డు వచ్చిన కారు అది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రమే కాదు. మెల్‌బౌర్న్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా వచ్చింది.

Ravishastri

Ravishastri

ఇప్పటికీ రవి శాస్త్రి దగ్గర ఆ కార్ ఉంది. అది గెలిచిన వెంటనే టీమిండియా ప్లేయర్లు చాలా మంది దానిపై కూర్చొని ఫొటోలు దిగారట. కపిల్ దేవ్ దిగిన పిక్స్ కూడా ఇంకా ఉన్నాయి. గెలిచిన వెంటనే ఫ్యూయెల్ చెక్ చేసుకుని మెల్ బౌర్న్ గ్రౌండ్ లో చక్కర్లు కొట్టానని శాస్త్రి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. దాని మీద ఎంత ప్రేమంటే అనుమతి లేకుండా తన తండ్రిని కూడా కార్ బయటకు తీసుకెళ్లనిచ్చేవాడు కాదట.

Ravishastri 4

Ravishastri 4

ఒక్క గీత కూడా లేకుండా, ఎటువంటి సొట్టలు లేకుండా ఇప్పటికీ వాడుతున్నాడు రవిశాస్త్రి. ప్రస్తుతం కెప్టెన్ గా కొనసాగుతోన్న విరాట్ కోహ్లీ ఆడి కారుకు అంబాసిడర్ గా ఉన్నారు. R8 V10 LMX, Audi A8 L, RS 6, RS 5, SQ 8 చాలా కార్లను సొంతం చేసుకున్నాడు విరాట్. మిగిలిన క్రికెటర్లకు కూడా ఇది సెట్ అయ్యే బ్రాండ్ అయిపోయింది.

Ravishastri 3

Ravishastri 3