IndVsAus 1st T20I : చెలరేగిన రాహుల్, హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.

IndVsAus 1st T20I : చెలరేగిన రాహుల్, హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్

IndVsAus 1st T20I : మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్, హార్ధిక పాండ్యాలు హాఫ్ సెంచరీలతో మెరిశారు. రాహుల్ 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు.

ఇక ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా రెచ్చిపోయాడు. పరుగుల వరద పారించాడు. 30 బంతుల్లోనే 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. హార్ధిక పాండ్యా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. కాగా.. విరాట్‌ కోహ్లీ(2), రోహిత్‌ శర్మ(11) తక్కువ స్కోరుకే ఔటై నిరాశపరిచారు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 209 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆసియా కప్‌లో లీగ్ దశలోనే వెనుదిరిగిన రోహిత్‌ సేన.. ఈ సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకొని వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు లోపాలు సరిదిద్దుకొనే ప్రయత్నంలో ఉంది.