షమీ ప్రభంజనం: 150కే బంగ్లా ఆలౌట్

భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.

షమీ ప్రభంజనం: 150కే బంగ్లా ఆలౌట్

భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఇండోర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ బంగ్లా పోరులో బంగ్లాదేశ్ చతికిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముష్ఫికర్ రహీమ్(43)పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శన కనబరచిన బంగ్లాదేశ్.. టీ20 ఓటమి నుంచి కోలుకున్నట్లు కనిపించడం లేదు. షమీ 3వికెట్లు, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు తీయగలిగారు. ముష్ఫికర్ తో పాటు, మోమినుల్ హఖ్(37), లిటన్ దాస్(21)మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేశారు. 

కాగా, బంగ్లాదేశ్ చివరిగా ఆడిన టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్ స్కోరు వివరాలిలా ఉన్నాయి. 147, 43, 149, 234, 211, 150 చేసింది.