IndVsSA 1st ODI : తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్.. సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా

లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా అయ్యింది.

IndVsSA 1st ODI : తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్.. సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా

IndVsSA 1st ODI : మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ వీరోచిత పోరాటం చేశాడు. గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.

సంజూ 63 బంతుల్లో 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ, సంజూ వీరోచిత పోరాటం వృథా అయ్యింది. జట్టుకి విజయం మాత్రం దక్కలేదు. మిగతా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం అందలేదు. దీంతో 40 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లకు 240 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్ లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. స్పిన్నర్ షంసీ ఆ ఓవర్ బౌలింగ్ చేయగా, సంజు శాంసన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదినా ఫలితం దక్కలేదు. టీమిండియా.. విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజు శాంసన్‌(86 నాటౌట్‌) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. శ్రేయస్‌ (37 బంతుల్లో 50), శార్దుల్‌ ఠాకూర్‌(31 బంతుల్లో 33) రాణించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), శుభ్ మాన్ గిల్ (3) విఫలం కావడం టీమిండియా ఛేజింగ్ పై ప్రభావం చూపింది. రుతురాజ్ గైక్వాడ్ 19, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లో ఎంగిడి 3 వికెట్లు పడగొట్టాడు. రబాడ 2 వికెట్లు తీశాడు. వ్యాన్ పార్నెల్, షంసి, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. డేవిడ్‌ మిల్లర్‌ (63 బంతుల్లో 75*), క్లాసెన్ (65 బంతుల్లో 74*), డికాక్‌ (54 బంతుల్లో 48) రాణించారు. దీంతో సఫారీ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0తో లీడ్ లో ఉంది.