Visakha : విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్

విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు స్టీల్‌ సిటీ అతిథ్యం ఇవ్వనుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 18న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్-టీమిండియా తలపడనున్నాయి.

Visakha : విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్

Visakha

International cricket match : దేశంలో మళ్లీ క్రికెట్‌ సందడి ఊపందుకోనుంది. టీ20ల మోత మోగనుంది. వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్‌ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్‌లకు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్‌తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్‌కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్‌ స్టేడియానికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది.

సుదీర్ఘ కాలం తర్వాత విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు స్టీల్‌ సిటీ అతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్ – టీమ్ ఇండియా తలపడనున్నాయి. హోమ్ సిరీస్‌లో భాగంగా బీసీసీఐ సిరీస్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే HCA మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్‌ను కూడా బీసీసీఐ కేటాయించలేదు. హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటాలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

BCCI : హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ప్రకటించని బీసీసీఐ..హెచ్‌సీఏలో అంతర్గత గొడవలే కారణమా?

ఆట కంటే అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతోనే క్రికెట్ కంట్రీలో కొంతకాలంగా ఫేమస్‌ అయిన HCAకు బీసీసీఐ గట్టి షాక్‌ ఇచ్చింది. భవిష్యత్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్యలో సొంతగడ్డపై భారత్‌ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్‌లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్‌కూ హైదరాబాద్‌ వేదిక కాదు. దీనికి HCAలోని ఇంటర్నల్‌ గొడవలే కారణంగా తెలుస్తోంది.