IPL 2021 CSK Vs DC : రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నేరుగా ఫైనల్ లోకి దూసు

IPL 2021 CSK Vs DC : రెచ్చిపోయిన రుతురాజ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

Ipl 2021 Csk Beats Dc

IPL 2021 CSK Vs DC : ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నేరుగా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.

సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. రుతురాజ్ 50 బంతుల్లో 70 రన్స్ చేశాడు. రాబిన్ ఊతప్ప (44 బంతుల్లో 63 పరుగులు) కూడా రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో టామ్ కర్ణ్ మూడు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, నోర్టే తలో వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మెయర్ దూకుడుగా ఆడారు. దీంతో డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.

పృథ్వీ షా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెట్మెయర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 37 పరుగులు నమోదు చేశాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ (7), శ్రేయాస్ అయ్యర్ (1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ కు 2 వికెట్లు లభించాయి. జడేజా, మొయిన్ అలీ, బ్రావో తలో వికెట్ తీశారు.

స్కోర్లు…
ఢిల్లీ-172/5
చెన్నై-173/6(19.2 ఓవర్లు)

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆదివారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యాయి. గత శుక్రవారం లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. ఇందులో పట్టికలో టాప్-2లో నిలిచిన ఢిల్లీ, చెన్నై మధ్య దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన సీఎస్కే నేరుగా ఫైనల్‌కి వెళ్లింది. ఈ మ్యాచ్ లో ఓడినా ఫైనల్ కి చేరేందుకు ఢిల్లీకి మరో చాన్సుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆడటం ద్వారా ఫైనల్‌కి చేరొచ్చు.

MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా ఇప్పటికే అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. మూడు సార్లు టైటిల్ విజేతగా కూడా నిలిచింది. కానీ.. గత మూడు సీజన్లుగా మాత్రమే వరుసగా ప్లేఆఫ్స్‌కి వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్.. గతేడాది ఫైనల్‌కి చేరినా ఆ జట్టు తొలి టైటిల్ కల నెరవేరలేదు. అన్నింటికీ మించి.. యువ క్రికెటర్లతో నిండిన ఆ జట్టు ప్లేఆఫ్స్‌ ఒత్తిడిని అధిగమించలేకపోతోంది. మరి కనీసం ఈ ఏడాదైనా ఆ బలహీనతని ఢిల్లీ ఓవర్ కమ్ చేస్తుందో లేదో చూడాలి.