IPL 2021 CSK Vs SRH చెన్నై జైత్రయాత్ర… హైదరాబాద్‌పై విజయం

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 19.4 ఓవర

IPL 2021 CSK Vs SRH చెన్నై జైత్రయాత్ర… హైదరాబాద్‌పై విజయం

Chennai Beats Hyderabad

IPL 2021 CSK Vs SRH : ఐపీఎల్ 2021 రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. షార్జా వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి రాణించాడు. 38 బంతుల్లో 45 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మొయిన్ అలీ17, అంబటి రాయుడు 17 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (45), డుప్లెసిస్‌ (40) ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌ రెండు మూడు ఓవర్ల ముందుగానే ముగుస్తుందనిపించింది. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటాక స్వల్ప తేడాతో మొయిన్ అలీ, సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌ వరుసగా ఔటయ్యారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ఆ తర్వాత రాయుడు జాగ్రత్తగా ఆడాడు. చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు కేవలం ఒకే రన్‌ వచ్చింది. క్రీజులో రాయుడు, ధోనీ ఉన్నప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ధోని నమ్మకాన్ని చెన్నై బౌలర్లు వమ్ము చేయలేదు. చెన్నై బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు నామమాత్రపు స్కోరే చేయగలిగింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. చెన్నై ముందు స్పల్ప విజయలక్ష్యం ఉంది.

హైదరాబాద్ ఓపెనర్‌ వృద్ధిమాన్ సాహా (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలోనే ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్‌ శర్మ (18), అబ్దుల్ సమద్‌ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు.

Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి

ఈ క్రమంలోనే హేజిల్‌ వుడ్‌ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవ్వడంతో హైదరాబాద్‌ జట్టుకి షాక్‌ తగిలింది. జేసన్‌ హోల్డర్‌ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్‌ వచ్చిన రషీద్‌ ఖాన్‌ (17), భువనేశ్వర్‌ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్‌ 3, బ్రావో 2 వికెట్లు తీసుకోగా.. శార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

స్కోర్లు..
హైదరాబాద్..134/7
చెన్నై…139/4(19.4ఓవర్లు)

హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి చేరింది. కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కి దూరమైంది. ఈ సీజన్‌ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ చిట్టచివరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్‌. ఐదు ఓటముల
తర్వాత రాజస్థాన్‌పై విజయం సాధించిన హైదరాబాద్, మళ్లీ చెన్నై చేతిలో చిత్తైంది. అటు 9 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ ఖాయం చేసుకుంది.

ధోనీ సారథ్యంలో సీఎస్కే ఈసారి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇదే జోరును మిగతా మ్యాచుల్లో కొనసాగిస్తే ఈ సారి టైటిల్‌ ను చెన్నై ఎగరేసుకెపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా మొయిన్‌ అలీ, అంబటి రాయుడు తమవంతు సహకారం అందిస్తున్నారు. చివరి ఓవర్లలో రవీంద్ర జడేజా ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు.

కెప్టెన్‌ ధోనీ, సురేశ్‌ రైనా అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు. వీరు కూడా ఫామ్‌లోకి వస్తే చెన్నై బ్యాటింగ్‌కి తిరుగుండదు. ఇక బౌలింగ్‌ విభాగంలో చెన్నై పటిష్టంగా కనిపిస్తోంది. దీపక్‌ చాహర్‌, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో కొనసాగుతున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఒకే విజయంతో సరిపెట్టుకుంది. రెండోదశలో మెరుగ్గా ఆడుతుందని భావించినా అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌కి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మూసుకుపోయాయి. తొలి దశలో అదరగొట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో రెండో దశకు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.