IPL 2021: ధోనీ.. అశ్విన్‌ను ప్రయోగాలు చేయనివ్వలేదు – సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదని అంటున్నారు వీరేంద్ర సెహ్వాగ్.

IPL 2021: ధోనీ.. అశ్విన్‌ను ప్రయోగాలు చేయనివ్వలేదు – సెహ్వాగ్

Ravichandran Ashwin

IPL 2021: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదని అంటున్నారు వీరేంద్ర సెహ్వాగ్. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఓటమి తర్వాత వీరూ ఇలాంటి కామెంట్లు చేశాడు. ‘అశ్విన్ స్వతహాగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. అవి కాకుండా కొత్త వేరియంట్లతో బాల్ వేసి బ్యాట్స్‌మన్ ముందే ఊహించేలా బౌలింగ్ చేస్తుండటంతో ధోనీ వాటికి అనుమతించే వాడు కాదని’ అంటున్నాడు.

‘రవిచంద్రన్ అశ్విన్ కు ఆఫ్ స్పిన్ వేసే మైండ్ సెట్ ఉంది. ఫోర్, సిక్స్ కావాలంటే ఎవరైనా అతని బౌలింగ్ ఈజీగా ఎదుర్కొనేవారు. ఈ భయంతో అతను తరచూ ప్రయోగాలుచేస్తుండేవాడు. కానీ, స్టంప్స్ వెనుక నిల్చొని చూసే ధోనీ అలాంటి వాటికి అవకాశమిచ్చేవాడు కాదు. కొన్నిసార్లు బ్యాట్స్‌మన్ సిక్సు కొట్టగలడు. లేదంటే అవుట్ అవగలడనేది రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆల్‌రౌండ్ షో చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 135 పరుగల టార్గెట్‌ను కేవలం 17.5 ఓవర్లలో ఛేదించారు. శ్రేయాస్ అయ్యర్ (47 నాటౌట్), రిషబ్ పంత్ (35 నాటౌట్)ల 67పరుగుల భాగస్వామ్యం జట్టుకు బలంగా మారింది.