ఐపీఎల్ వేలంలో సచిన్ కొడుకు, 1,097 మంది దరఖాస్తు

ఐపీఎల్ వేలంలో సచిన్ కొడుకు, 1,097 మంది దరఖాస్తు

IPL-2022

IPL 2021 Sachin Tendulkar’s son : రానున్న ఐపీఎల్ సీజన్‌ వేలానికి దాదాపు ఒకవెయ్యి 97మంది ఆగటాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చెన్నై వేదికగా ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి వేలం ప్రారంభంకానుంది. ఈ వేలానికి 21మంది టీమిండియా ప్లేయర్లతోసహా 207మంది అంతర్జాతీయ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. వేలంలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కనీస ధరను 20 లక్షలుగా తన పేరును నమోదు చేసుకున్నారు.

మరోవైపు హర్బజన్‌ సింగ్‌, గ్లెన్‌మాల్స్‌వెల్‌ కేదార్‌ జాదవ్‌, స్టీవ్‌స్మిత్‌, షకిబ్‌ అల్‌హాసన్‌సహా మరికొంత మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో పాల్గొననున్నారు. 2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో లీగ్‌కు దూరమైన సీనియర్‌ పేసర్‌ శ్రీశాంత్‌ కనీస ధర 75 లక్షలతో వేలానికి వస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఈవేలానికి దూరం కానున్నాడు.

ఐపీఎల్‌ వేలానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా వెస్టిండీస్‌ నుంచి 56 మంది ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి 42, సౌతాఫ్రికా నుంచి 38, శ్రీలకం 31, ఆప్ఘనిస్తాన్‌ 30, న్యూజిలాండ్‌ 29, ఇంగ్లండ్‌ 21మందితోపాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు 139మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా 57మంది ఆటగాళ్లను వదలేసుకున్నాయి.