IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఈరోజు కూడా వర్షం కురిస్తే విజేతలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం..

IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఈరోజు కూడా వర్షం కురిస్తే విజేతలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

IPL 2023 Final Match

IPL 2023 Final – CSK vs GT: ఇండియన్ ప్రిమియర్ లీగ్‌ (IPL)లో గతంలో ఎదురవని పరిస్థితి ప్రస్తుత సీజన్‌లో ఎదురైంది. 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అహ్మదాబాద్‌ (Ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ వాయిదాపడింది. భారీ వర్షం కారణంగా మైదానంలో నీరు నిలవడంతో మ్యాచ్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వ్ డే సోమవారంకు వాయిదా వేశారు. సోమవారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

IPL 2023 Final: ఫైనల్ పోరులో గుజరాత్‌ విజయం ఖాయమా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే

ఆదివారం ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకు గంట ముందునుంచే జల్లులు మొదలయ్యాయి. క్రమంగా అవి పెరుగుతూ భారీ వర్షం కురిసింది. రాత్రి 9గంటల ప్రాంతంలో వర్షం తెరిపినివ్వడంతో మ్యాచ్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే, మళ్లీ భారీ వర్షం కురిసింది. దీంతో రాత్రి 11గంటల సమయంలో మ్యాచ్ ను సోమవారంకు వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే, సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

CSK vs GT IPL 2023 : దటీజ్ ధోని.. ఒక్క మ్యాచ్ తో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డులు

సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. సోమవారం అర్థరాత్రికైనా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకుంటే 15ఓవర్లు, 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అలాకూడా సాధ్యంకాని పక్షంలో ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సి ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాని పక్షంలో అర్థరాత్రి 1.20 గంటల సమయం వరకు సూపర్ ఓవర్‌తోనైనా మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. సూపర్ ఓవర్ ద్వారాకూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించలేని పక్షంలో లీగ్ దశలో పాయింట్లను బట్టి విజేతలను నిర్ణయిస్తారు.

IPL2023 final: వ‌రుణుడి ఎఫెక్ట్‌.. ఐపీఎల్ ఫైన‌ల్ వాయిదా

ఆదివారం మాదిరిగా సోమవారంకూడా భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలుస్తుంది. ఐపీఎల్ నియమావళి ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతం లీగ్ దశలో గుజరాత్ 14 మ్యాచ్‌లు ఆడి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ 16వ సీజన్ ట్రోపీ గుజరాత్ టైటాన్స్ జట్టు అందుకుంటుంది.