IPL 2023 : సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. ముంబై ఘన విజయం
IPL 2023 : ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.

Ipl 2023 MI Vs RCB
IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.
మరో బ్యాటర్ నేహల్ వధేరా హాఫ్ సెంచరీతో రాణించాడు. వధేరా 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దాంతో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2023)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్-2023లో ఇది 54వ మ్యాచ్. టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ చేసింది. ముంబై ఇండియన్స్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ 65, గ్లెన్ మ్యాక్స్ వెల్ 68, దినేశ్ కార్తీక్ 30 పరుగులు బాదారు.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి ఆరింటిలో గెలుపొందింది. 12 పాయింట్లతో ఆ జట్టు ఏకంగా ఎనిమిదో స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా 11 మ్యాచులు ఆడి ఐదింటిలో గెలుపొందింది. ఆర్సీబీ 10 పాయింట్లతో ఆరు నుంచి
7వ స్థానానికి పడిపోయింది.