IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌‌తో జరిగిన మ్యాచులో రాజ‌స్థాన్ కెప్టెన్ “శుద్ధ తప్పు” చేశాడని సైమన్ ఎందుకు అన్నారు?

IPL 2023: మ్యాచు చివర్లో సంజూ శాంసన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఆ నిర్ణయమే ఓటమికి కారణమా?

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌‌తో జరిగిన మ్యాచులో రాజ‌స్థాన్ కెప్టెన్ “శుద్ధ తప్పు” చేశాడని సైమన్ ఎందుకు అన్నారు?

RR Skipper Sanju Samson, Former New Zealand cricketer Simon Doull

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad)తో ఆదివారం జరిగిన మ్యాచులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) శుద్ధ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ (Simon Doull) విమర్శించారు.

ఏం జరిగింది?

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్( (RR)పై స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (SRH) లక్ష్య ఛేదనలో చిట్టచివరి బంతికి సఫలమైన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసి రాజ‌స్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని హైదరాబాద్ జట్టు 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది.

చివరి నాలుగు ఓవర్లలో హైదరాబాద్ జట్టు 57 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒబెడ్ మెక్కాయ్ మైదానంలోకి వచ్చాడు. మెక్కాయ్ 17వ ఓవ‌ర్‌లో బౌలింగ్ చేసి 13 ప‌రుగులు సమర్పించుకున్నాడు. ఆ సమయంలో క్రీజులో రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్ర‌మ్‌ ఉన్నారు. 17వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి క్యాచ్ ను శాంసన్ మిస్ చేశాడు.

ఆ తర్వాత ఒబెడ్ మెక్కాయ్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. కుల్దీప్ యాదవ్ 19వ ఓవర్ వేసి 24 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్క ఓవర్లో హైదరాబాద్ 16 పరుగులు చేయాల్సి ఉండగా 20వ ఓవర్ వేసిన సందీప్ శర్మ ఆ జట్టు బ్యాటర్లను ఆ పరుగులు చేయకుండా కట్టడి చేయలేకపోయాడు. 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలిచింది.

సైమన్ డౌల్ ఏమన్నారు?

దీనిపైనే సైమన్ డౌల్ స్పందిస్తూ… చివరి ఓవర్లలో ఒబెడ్ మెక్కాయ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే బాగుండేదని చెప్పారు. “అసలు మెక్కాయ్ ను మైదానంలోకి ఎందుకు రమ్మన్నారు? చివర్లో బౌలింగ్ చేయడానికే కదా? మెక్కాయ్ 17వ ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు.. సరే.. కానీ, సంజూ శాంసన్ క్యాచ్ మిస్ చేశాడు కదా.

ఓ వికెట్ దక్కేది. ఆ ఓవర్లో మెక్కాయ్ 13 పరుగులు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అయితే, అతడికి మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకపోవడం సరికాదు. అతడు అన్ని పరిస్థితుల్లో సమర్థంగా బౌలింగ్ చేయగలడు. 17 ఓవర్ తర్వాత అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం చాలా పెద్ద తప్పు. ఇది సంజూ శాంసన్ తప్పు. శుద్ధ తప్పు” అని విమర్శించారు.

IPL 2023, RR vs SRH: రాజ‌స్థాన్ కొంప‌ముంచిన నోబాల్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజ‌యం