IPL2022 RCB Vs MI : చెన్నై బాటలో ముంబై.. వరుసగా 4వ పరాజయం.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపు

ముంబై ఇండియన్స్ కి మరో షాక్ తగిలింది. వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు..

IPL2022 RCB Vs MI : చెన్నై బాటలో ముంబై.. వరుసగా 4వ పరాజయం.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపు

Ipl2022 Rcb Vs Mi

IPL2022 RCB Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కి మరో షాక్ తగిలింది. వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. 7 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ముంబైని చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు మరో 9 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది. బెంగళూరు జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.(IPL2022 RCB Vs MI)

బెంగళూరు బ్యాటర్లలో అనుజ్ రావత్ అదరగొట్టాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. రావత్ 47 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లి 36 బంతుల్లో 48 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ముంబై బౌలర్లలో ఉనద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ తలో వికెట్ తీశారు. ఈ మెగా టోర్నీలో ముంబైకి ఇది వరుసగా 4వ పరాజయం కాగా బెంగళూరుకిది హ్యాట్రిక్ విక్టరీ.

IPL 2022 : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

సూర్యకుమార్ వన్ మేన్ షో…
కాగా, బెంగళూరుతో పోరులో ముంబై జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే అందుకు సూర్యకుమార్ యాదవ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్సే కారణం. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓ దశలో 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబైని చూస్తే కనీసం 100 పరుగులు సాధిస్తే గొప్ప అనిపించింది.

కానీ, జయదేవ్ ఉనద్కత్ ను ఓ ఎండ్ లో ఉంచి, మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిన వైనం ముంబై అభిమానులను ఉర్రూతలూగించింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 6 భారీ సిక్సులు ఉన్నాయి. మైదానంలో అన్ని వైపులా భారీ షాట్లు కొట్టిన సూర్య.. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు.

అంతకుముందు, ఓపెనర్లు ఇషాన్ కిషన్ 26, రోహిత్ శర్మ 26 పరుగులు చేసి అవుటయ్యారు. బేబీ డివిలియర్స్ గా పేరుతెచ్చుకున్న దక్షిణాఫ్రికా సంచలనం డివాల్డ్ బ్రెవిస్ 8 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0) డకౌట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్ యాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో ఆ జట్టు స్కోరు 150 మార్కు దాటింది. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ 2, హర్షల్ పటేల్ 2, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.

జట్ల వివరాలు :
ముంబైయి: రోహిత్ శర్మ (కెప్టెన్‌), డెవాల్డ్‌ బ్రెవిస్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమణ్ దీప్‌ సింగ్, మురుగన్‌ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కత్, జస్ప్రీత్‌ బుమ్రా, బాసిల్ థంపి

బెంగళూరు: డు ప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్‌ కార్తిక్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, సిరాజ్‌, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్

స్కోర్లు…
ముంబై ఇండియన్స్ 151/6
బెంగళూరు – 152/3 (18.3 ఓవర్లు)

చెన్నైని కాపీ కొడుతున్న ముంబై.. వైరల్ గా మారిన మీమ్
ఐపీఎల్ చరిత్రలో ఛాంపియన్స్ గా పేరొందిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈసారి ఆ రెండు జట్లు ఘోరంగా విఫలం అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తొలి 4 మ్యాచుల్లో ఓడింది. ముంబై కూడా అదే బాటలో పయనిస్తోంది. ఆడిన 4 మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. రెండు టీమ్ కలిసి ఇప్పటివరకు 9 సార్లు కప్ కొట్టాయి. అలాంటి మేటి జట్లు ఈసారి మాత్రం ఇంకా బోణ కూడా కొట్టలేకపోతున్నాయి. కాగా, చెన్నై దారిలోనే ముంబై ఇండియన్స్ నడుస్తోందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓటముల్లో సీఎస్కేను రోహిత్ సేన కాపీ కొడుతోందనే మీమ్ నవ్వులు పూయిస్తోంది.