వార్నర్‌పై విలియమ్సన్ ఎరుపు దాడి

10TV Telugu News

గతేడాది ముగిసిన సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2019 సీజన్ తొలి మ్యాచ్ లోనే తడబడింది. అయినప్పటికీ జట్టు సంబరాల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. హోళీ పండగ రోజు ఆర్మీ గెటప్‌లతో రంగులు చిమ్ముకున్న ప్లేయర్లు.. మరోసారి సంబరాలు జరుపుకుంటున్నారు. 
Read Also : మనూ-సౌరవ్‌లు స్వర్ణాన్ని షూట్ చేశారు

తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని కేన్ విలియమ్సన్ శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రాక్టీస్ చేస్తూ డేవిడ్ వార్నర్ పై రంగుదాడికి దిగాడు. ఈ వీడియోను సన్‌రైజర్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేస్తూ కేన్ విలియమ్సన్‌కు ఇంకా హోళీ సరదా తీరనట్లుగా అనిపిస్తోంది. అంటూ ట్వీట్ చేసింది. 

వార్నర్ అక్కడితో ఆగలేదు. విలియమ్సన్‌పై నీళ్లు విసిరాడు. దీనిపై వారిద్దరినీ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘బాగుంది. అంతా బాగా జరిగింది. నాలుగు గంటలు నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేశాం’ అని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో వార్నర్‌ బాహుబలిలో క్యారెక్టర్‌లా చేయాలనుకున్నానని చెప్పి ముగించాడు. 

×