IPL 2021 : పంజాబ్ పై కోల్ కతా విజయం

పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2021 : పంజాబ్ పై కోల్ కతా విజయం

Knight Riders Beat Kings By 5 Wickets

PBKS vs KKR : పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు బ్యాట్స్ మెన్స్ అష్టకష్టాలు పడ్డారు. పరుగులు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. 124 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కోల్ కతా 5 వికెట్లు కోల్పోయి 20 బంతులు మిగిలి ఉండగానే..126 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ జట్టులో మయాంక్ 31, జోర్డాన్ 30 పరుగులు చేశారు. కోల్ కతా జట్టులో మోర్గాన్ 47, త్రిపాఠి 41 పరుగులు చేశారు.

ఓపెనర్లుగా వచ్చిన గిల్ (9), రానా (0) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కేవలం 5 పరుగుల వద్ద రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఈ వికెట్లను షమీ, హెన్రిక్స్ తీశారు. తర్వాత వచ్చిన త్రిపాఠి జట్టును ఆదుకొనేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. కానీ..ఇతర బ్యాట్స్ మెన్స్ సహకారం అందించలేకపోయారు. జట్టు స్కోరు 17 వద్ద నరైన్ (0) అవుట్ అయ్యాడు.

అనంతరం వికెట్ పోకుండా..త్రిపాఠి, మోర్గాన్ లు ఆడారు. అయితే..83 స్కోరు వద్ద..41 పరుగుల వద్ద త్రిపాఠి వికెట్ ను కోల్పోయింది కోల్ క తా జట్టు. 98 స్కోరు వద్ద రస్సేల్ (10) వికెట్ కోల్పోయింది. మోర్గాన్ మాత్రం తన ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. జట్టును విజయతీరాలకు తీర్చే ప్రయత్నం చేశాడు. కార్తీక్ 12 రన్లు, మోర్గాన్ 47 రన్లతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయం సాధించింది. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో జోర్డాన్ (18 బంతుల్లో 30) కొద్దిగా ధాటిగా ఆడడంతో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది.

కోల్ కతా జట్టులో ప్రసిద్ధ్ 3, కమ్మిన్స్ 2, నరైన్ 2, మావి, చక్రవర్తిలు చెరో ఒక్కో వికెట్ తీశారు.
పంజాబ్ జట్టులో హెన్రిక్స్, షమీ, అర్షదీప్, హుడాలు ఒక్కో వికెట్ తీశారు.