Mohammed Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు.. ప్రతీనెల 1.30లక్షలు చెల్లించాల్సిందే ..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 50వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చు నిమిత్తం కేటాయించటం జరుగుతుందని కోర్టు పేర్కొంది.

Mohammed Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు.. ప్రతీనెల 1.30లక్షలు చెల్లించాల్సిందే ..

mahamad sahami

Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 50వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చు నిమిత్తం కేటాయించటం జరుగుతుందని కోర్టు పేర్కొంది. అయితే, నెలవారీ భరణం రూ. 1.30లక్షలుగా కోర్టు ఆదేశాలకు కృతజ్ఞతలు తెలిపిన జహాన్..  భరణం ఎక్కువ మొత్తం ఉంటే తాను ఉపశమనం పొందుతానని పేర్కొంది. ఈ కోర్టు తీర్పుపై క్రికెటర్ షమీ నుంచి ఎలాంటి స్పందన ఇంకారాలేదు.

Cricketer Shami wife requests..change India Name: భారతదేశం పేరు మార్చాలని ప్రధాని మోడీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య

షమీ, అతని భాగస్వామి హసిన్ జహాన్ మధ్య 2018లో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో జహాన్ తనభర్త షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్, వరకట్నం వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. షమీ తన భార్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు. ఆ తరువాత వారు విడిపోయారు. నాపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది నా పరువు తీయడానికి, నా కెరీర్ కు ముగింపు పలకడానికి చేసిన ప్రయత్నం అని షమీ వాపోయాడు. దేశానికి ద్రోహం చేయడం కంటే చనిపోవడమే తనకు ఇష్టమని అన్నాడు. అయితే, షమీ నుంచి విడిపోయిన సమయంలో వారికి ఒక కుమార్తె ఉంది. షమీ తన పోషణకు, తన కుమార్తె పోషణకు నెలకు రూ. 10లక్షలు భరణం ఇవ్వాలని హసిన్ జహాన్ కోర్టులో దావా వేసింది.

క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్: 15రోజుల్లో లొంగిపోవాల్సిందే

రూ. 10లక్షలు అడగడానికి కారణంకూడా జహాన్ లాయర్ కోర్టుకు తెలిపాడు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో షమీ ఆదాయపు పన్ను రిటర్న్‌ల ప్రకారం.. అతని వార్షిక ఆదాయం రూ. 7కోట్లకుపైగా ఉందని, దీంతో అతను తననుండి విడిపోయిన భార్య, బిడ్డ పోషణకు రూ.10లక్షలు ఇవ్వాలని జహాన్ లాయర్ కోర్టు తెలిపారు. షమీ లాయర్ తన వాదనలో.. జహాన్ స్వయంగా ప్రొఫెషనల్ ఫ్యాషన్ మోడల్ అని, ఆమె ఆ రంగంలో స్థిరమైన ఆదాయం కలిగి ఉండటం ద్వారా రూ. 10లక్షలు భరణం కోరడం సమర్ధనీయం కాదని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నెలవారి భరణం రూ.1.30లక్షలుగా నిర్ణయించింది.