IPL2023: అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వ‌రుణుడు ఇబ్బంది పెట్టినా..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ నేటి(సోమ‌వారం)కి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌నీసం ఈ రోజు అయినా మ్యాచ్ జ‌రుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానుల‌ను వెంటాడుతున్నాయి.

IPL2023: అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వ‌రుణుడు ఇబ్బంది పెట్టినా..

weather update for IPL 2023 Final

IPL2023 Final: అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఫైన‌ల్(IPL2023 Final) మ్యాచ్ నేటి(సోమ‌వారం)కి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌నీసం ఈ రోజు అయినా మ్యాచ్ జ‌రుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానుల‌ను వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌కు ఇది ఖ‌చ్చితంగా శుభ‌వార్తే. ఈ మ్యాచ్‌కు కూడా వ‌రుణుడు ఆటంకాలు క‌లిగించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి మ్యాచ్ ర‌ద్దు అయ్యే స్థాయిలో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని స‌మాచారం.

అక్యూవెదర్ ప్రకారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వర్షం పడే అవకాశం ఏడు శాతం ఉంది. సాయంత్రం 6 గంటలకు ఐదు శాతం వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. అయితే.. రాత్రి 7 గంటల నుంచి వ‌ర్షం ప‌డే అవ‌కాశం లేదు. ఒక‌వేళ మ్యాచ్‌కు ముందు వ‌ర్షం ప‌డినా అహ్మ‌దాబాద్‌లో అద్భుత‌మైన డ్రైనేజీ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంది. ఈ కార‌ణంగా కాస్త ఆల‌స్య‌మైనా మ్యాచ్ ఖ‌చ్చితంగా జ‌రుగుతుంది.

IPL2023 Final : మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌

అహ్మ‌దాబాద్‌లో ఉష్ణోగ్రత 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. తేమ 40 నుంచి 50శాతంగా ఉంది. మ్యాచ్ స‌మ‌యంలో 90 శాతానికి మ‌బ్బులు క‌మ్మిన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికి వ‌ర్షం ప‌డే అవ‌కాశం లేద‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది.

ఏ స‌మ‌యం వ‌ర‌కు మ్యాచ్ మొద‌లైతే ఓవ‌ర్ల కుదింపు ఉండ‌దు

వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ఆల‌స్యంగా అంటే రాత్రి 9.40 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభ‌మైనా ఓవ‌ర్ల‌లో ఏ మాత్రం కోత విధించ‌రు. ఆ స‌మ‌యం దాటితే మాత్రం ఓవ‌ర్ల‌లో కోత విధిస్తారు. క‌నీసం ఐదు ఓవ‌ర్ల మ్యాచ్ నిర్వ‌హించ‌డానికి క‌టాఫ్ స‌మ‌యం రాత్రి 11.56 కాగా.. సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌కు క‌టాఫ్ స‌మ‌యం మంగ‌ళ‌వారం ఉద‌యం 1.20 గా నిర్ణ‌యించారు. అప్ప‌టి వ‌ర‌కు కూడా ప‌రిస్థితులు మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు అనుకూలంగా లేక‌పోతే అప్పుడు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తారు. అదే స‌మ‌యంలో ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లీగ్ ద‌శ‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజ‌రాత్ టైటాన్స్‌ను విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

IPL 2023: ఫైనల్ మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడడంపై మీమ్స్.. ఇక మెట్రో ట్రైన్లోనైతే…