క్రికెటర్ నబీ ట్వీట్ : నేను చనిపోలేదు..బతికే ఉన్నా

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 10:46 AM IST
క్రికెటర్ నబీ ట్వీట్ : నేను చనిపోలేదు..బతికే ఉన్నా

నేను చనిపోలేదు..బతికే ఉన్నానంటున్నాడు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలని రూమర్లు క్రియేట్ చేశారని వాపోయాడు. కొన్ని రోజులుగా నబీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అంతేగాకుండా..నబీ ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫొటోలను అప్ఘన్ క్రికేట్ బోర్డు పోస్టు చేసింది. 

కొన్ని రోజులుగా నబీ గుండెపోటుతో చనిపోయాడంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలు నిజం కాదని నబీ స్పష్టం చేశాడు. కబిల్ స్టేడియంలో నబీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవలే నబీ అత్యధిక అంతర్జాతీయ టీ 20 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. టీ 20 ఫార్మాట్‌లో 12వ సారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ..84 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. 

నబీ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. పొట్టి ఫార్మాట్‌లో అతడు కీలక ఆటగాడు. మ్యాచ్ రూపురేఖలను మార్చే సత్తా ఉన్న ఈ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ మూడు టెస్టులు, 121 వన్డేలు, 67 టీ 20లు, ఆడాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.  ఇతను గత నెలలో టెస్టుకు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయినా..వన్డేలు, ట్వంటీ 20లలో ఆడుతున్నాడు. 2017 జులైలో అప్ఘనిస్తాన్ టెస్టు హోదా పొందిన తర్వాత..మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది ఈ టీం. ఇందులో నబీ కీలక పాత్ర పోషించాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 33 పరుగులతో తన కెరీర్‌ను నబీ ముగించాడు. టెస్టు కెరీర్‌లో 8 వికెట్లు తీయగలిగాడు.