MS Dhoni: ధోని మంచి మ‌న‌సుకు నిద‌ర్శ‌నం ఇదే.. తాను ట్రోఫిని తీసుకోకుండా తెలుగు తేజం రాయుడికి ఇప్పించాడు

అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుత‌ విజ‌యాన్ని సాధించింది. దీంతో ఐపీఎల్‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియ‌న్స్ రికార్డును చెన్నై స‌మం చేసింది.

MS Dhoni: ధోని మంచి మ‌న‌సుకు నిద‌ర్శ‌నం ఇదే.. తాను ట్రోఫిని తీసుకోకుండా తెలుగు తేజం రాయుడికి ఇప్పించాడు

Ambati Rayudu Lift IPL 2023 Winning Trophy (photo @CSK Twitter)

MS Dhoni-Ambati Rayudu:అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్(IPL Final) మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుత‌ విజ‌యాన్ని సాధించింది. దీంతో ఐపీఎల్‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియ‌న్స్ రికార్డును చెన్నై స‌మం చేసింది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 5 సార్లు క‌ప్పును ముద్దాడాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు అంబ‌టి రాయుడు(Ambati Rayudu) గుడ్ బై చెప్పేశాడు.

మ్యాచ్ అనంత‌రం రాయుడు మాట్లాడుతూ.. త‌న ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ముగిసింద‌ని, ఇంక‌త‌కంటే త‌న‌కు ఏమీ వ‌ద్ద‌న్నాడు. ఇది అస్స‌లు న‌మ్మ‌శ‌క్యం కాని విజ‌యం అని అన్నాడు. ఇది నిజంగా అదృష్టంగానే బావిస్తున్న‌ట్లు రాయుడు తెలిపారు. ఇక జీవితాంతం తాను నువ్వుతూ ఉండ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చాడు. తాను 30 ఏళ్లుగా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాన‌ని, ఇంత‌కాలంగా త‌న‌ను ఆద‌రించిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. కుటుంబానికి, ముఖ్యంగా నాన్నకు ధన్యవాదాలు చెప్పాడు.

Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబ‌టి రాయుడు గుడ్ బై

గుజ‌రాత్ టైటాన్స్‌తో ఫైన‌ల్ మ్యాచ్ కు ముందు త‌న‌కు ఇదే చివ‌రి మ్యాచ్ అని రాయుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. మే 28న జ‌ర‌గాల్సిన మ్యాచ్ మే 29కి వాయిదా ప‌డింది.. ఆఖ‌రి మ్యాచులో రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు బాది 19 ప‌రుగుల‌తో జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్ధ‌వంతంగా పోషించాడు.

IPL2023 Final: ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ పై విజ‌యం

ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 2010లో ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు అంబ‌టి రాయుడు. ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడాడు. 28.29 స‌గ‌టుల‌తో 4,348ప‌రుగులు చేశాడు. ఇందులో 23 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ముంబై జ‌ట్టుకు 2010 నుంచి 2017 వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ త‌రువాత వేలంలో చెన్నై 2018లో సొంతం చేసుకుంది. అప్ప‌టి నుంచి చెన్నైలో కీల‌క ఆట‌గాడిగా రాణిస్తున్నారు. రాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు ఐపీఎల్ టైటిళ్ల‌కు అందుకున్నాడు. ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 2013,2015, 2017 సీజ‌న్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున 2018, 2021, 2023లో టైటిల్‌ల‌ను అందుకున్నాడు.

IPL 2023 Final: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. సీఎస్‌కే ఫ్యాన్స్ ఖుషీఖుషీ

ఇదీ క‌దా ధోని అంటే..

ఇక మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఐపీఎల్ ట్రోఫీని సాధార‌ణంగా కెప్టెన్‌కు అందిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డ చెన్నై కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని చేసిన ప‌ని అంద‌రికి ఆశ్చ‌ర్యంగా క‌నిపించింది. ట్రోఫి అందుకోవ‌డానికి ధోని ఒక్క‌డే వెళితే స‌రిపోతుంది కానీ త‌న‌తో పాటు అంబ‌టి రాయుడు, జ‌డేజాల‌కు కూడా తీసుకువెళ్లాడు. ఆఖ‌రి మ్యాచ్ ఆడిన రాయుడుకి క‌ప్పు అందించాల్సిందిగా కోరాడు. దీంతో బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జై షా చేతుల మీదుగా రాయుడు ఐపీఎల్ క‌ప్పును మొద‌ట‌గా అందుకున్నాడు. ఆ త‌రువాత‌ జ‌డేజా ప‌ట్టుకున్నాడు. ఆఖ‌ర‌ల్లో ధోని ట్రోఫిని అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌హి చేసిన ప‌నిపై నెటీజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. నిస్వార్థ‌మైన నాయ‌కుడివి అంటూ కామెంట్లు పెడుతున్నారు.