ధోనీ.. గెంటెయ్యకముందే గౌరవంగా వెళ్లిపో : గవాస్కర్

  • Published By: vamsi ,Published On : September 20, 2019 / 09:43 AM IST
ధోనీ.. గెంటెయ్యకముందే గౌరవంగా వెళ్లిపో : గవాస్కర్

‘ధోనీ భారత జట్టుకు చాలా చేసాడు. అతని విలువ ఎప్పుడూ అలాగే ఉంటుంది. పరుగులు, స్టంపింగ్‌లు మాత్రమే కాదు అతడు కెప్టెన్ గా టీమిండియా క్రికెట్ కు ఎంతో చేశాడు. ఇప్పటికీ తన అనుభవాలను మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పంచుకుంటున్నాడు. అతని అనుభవం అవసరమే. కానీ అతని టైమ్ అయిపోయింది. ధోనీ అంటే అందరికీ గౌరవమే.. అయితే అతని గౌరవాన్ని అతను నిలుపుకోవాలి. ఎవరూ గెంటేయకుండా అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి’ అని అని అభిప్రాయపడ్డాడు వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.

ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ధోనీ తన భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. ధోనీకి లక్షలాది మంది అభిమానులున్నారు. వాళ్లలో నేనూ ఒకడిని, అందుకే ఎవరూ పంపకుండానే అతడు గౌరవంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని గవాస్కర్ సూచించారు. ధోనీకి ఉద్వాసన చెప్పాలని మేనేజ్‌మెంట్ భావించకముందే.. అతనే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది.

ధోనీ రిటైర్మెంట్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా ధోనీ మాత్రం ఇప్పటివరకు రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. వచ్చే టీ-20 ప్రపంచకప్ సమయానికి ధోనీ వయసు 39 ఏళ్లు. ఆ వయసులో క్రికెట్ ఆడడం చాలా కష్టం. అని కూడా గవాస్కర్ అన్నాడు.