IPL 2023: సూర్య విధ్వంసం.. గుజరాత్ పై ముంబై ఘన విజయం.. రషీద్ ఖాన్ మెరుపులు వృధా
సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. అన్ని విభాగాల్లో రాణించి గుజరాత్‌ను మట్టికరించింది. తద్వారా ప్లే ఆఫ్స్ మరింత చేరువైంది.

MI Win (Photo: @Mumbai Indians)
MI vs GT: సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans))తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) సత్తాచాటింది. అన్ని విభాగాల్లో రాణించి గుజరాత్‌ను మట్టికరించింది. తద్వారా ప్లే ఆఫ్స్ మరింత చేరువైంది. 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో రషీద్ ఖాన్(79 నాటౌట్), డేవిడ్ మిల్లర్(41; 26 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లు), విజయ్ శంకర్(29; 14 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించారు. సాహా(2), శుభ్‌మన్ గిల్(6), హార్దిక్ పాండ్యా(4), అభినవ్ మనోహర్(2), తెవాటియా(14)లు ఘోరంగా విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయగా పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు, బెహ్రెన్ డార్ఫ్ ఓ వికెట్ పడగొట్టాడు.
Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు
రషీద్ ఖాన్ సిక్సర్ల వర్షం
ఓ వైపు వికెట్లు కోల్పోయినప్పటికి రషీద్ ఖాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్.. రషీద్ విధ్వంసంతో 191 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ ధాటికి ఓ దశలో ముంబై జట్టులో కలవరం మొదలైంది. అయితే భారీ లక్ష్యం కావడం, ఇంకో వైపు ధాటిగా ఆడే బ్యాటర్లు లేకపోవడంతో గుజరాత్ ఓటమి పాలైంది.
అంతకముందు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తొలి శతకాన్ని చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో ఇషాన్ కిషన్(31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్). విష్ణు వినోద్(30; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషన్ కిషన్(31; 20బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా మోహిత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
Suryakumar Yadav: ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేసిన సూర్యకుమార్.. టీ20 క్రికెట్‌లో ఎన్నోదంటే..?