T20 World Cup 2024: రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు.. పోటీలో 20 జట్లు.. నాలుగు గ్రూపులు

టీ20 వరల్డ్ కప్-2024 కోసం ఇప్పట్నుంచే ఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చాలని ఐసీసీ భావిస్తోంది. దీని కోసం టోర్నీ ఫార్మాట్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది.

T20 World Cup 2024: రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు.. పోటీలో 20 జట్లు.. నాలుగు గ్రూపులు

T20 World Cup 2024: తదుపరి టీ20 వరల్డ్ కప్ 2024లో జరగబోతుంది. వెస్టిండీస్‌తోపాటు, యూఎస్ఏలో ఈ టోర్నీ నిర్వహిస్తారు. అయితే, ఈ మెగా టోర్నీ కోసం కీలక మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కొత్త ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది.

Assam-Meghalaya Border: అసోం-మేఘాలయ సరిహద్దులో అటవీ అధికారుల కాల్పులు.. ఐదుగురు మృతి

ఈ టోర్నీలో ఈసారి 20 జట్లు తలపడబోతున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా, గ్రూప్‌కు ఐదు జట్లుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్ల చొప్పున, మొత్తం ఎనిమిది జట్లను ఎంపిక చేసి సూపర్-8 ఫేజ్ నిర్వహిస్తారు. సూపర్-8లో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ నిర్వహిస్తారు. రెండు గ్రూపుల్లోని జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఈ టోర్నీలో పాల్గొనే జట్ల ఎంపిక జరుగుతోంది. ఆతిథ్య దేశాలుగా అటు యూఎస్ఏ, వెస్టిండీస్ ఎలాగూ టోర్నీలో పాల్గొంటాయి. ఈ రెండు జట్లతోపాటు ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్నాయి కాబట్టి అర్హత సాధించాయి.

Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి

ఇక ఇటీవలి టోర్నీలో రాణించిన అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. దీంతో మొత్తం 12 జట్లు టోర్నీకి అర్హత సాధించాయి. మిగతా ఎనిమిది జట్లను ఎంపిక చేయాల్సి ఉంది. జింబాబ్వే, నమీబియా, స్కాట్లాండ్ వంటి జట్లు క్వాలిఫై మ్యాచ్‌లు ఆడి అర్హత సాధించాల్సి ఉంటుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024, జూన్‌లో ప్రారంభమవుతుంది.