Fake Account: ఫేక్ అకౌంట్ నుంచి నీరజ్‌కు అభినందనలు.. పాకిస్తాన్ ఆటగాడిపై ఆగ్రహం

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

Fake Account: ఫేక్ అకౌంట్ నుంచి నీరజ్‌కు అభినందనలు.. పాకిస్తాన్ ఆటగాడిపై ఆగ్రహం

Ind Pak

Arshad Nadeem: టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసిరి రికార్డు క్రియేట్ చెయ్యగా.. వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీట్లు విసిరి వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. అయితే ఫైనల్ రౌండ్‌లో జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో నిలవగా.. పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ 84.62 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన తర్వాత అనేక మంది సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఎంతో మంది అభినందనలు తెలియజేవారు.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ చేసినట్లుగా ఓ ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. 5వ స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అందులో ‘స్వర్ణ పతకం గెలిచిన నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు’.. ‘సారీ పాకిస్తాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను’ అని నదీమ్ రాశారనేది సారాంశం. జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన కాసేపటికే చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ‘ఐడల్’ గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ విమర్శించారు.

అయితే, అసలు ఆ ట్విట్టర్ అకౌంట్ నకిలీదని, ‘సయీద్ అన్వర్’ అనే పేరును నదీమ్ పేరిట మార్చి ట్వీట్లు చేసినట్లుగా గుర్తించారు. అంతకుముందు 2018 ఏసియన్ గేమ్స్‌లో వీరిద్దరి షేక్ హ్యాండ్ వైరల్‌ అయ్యింది. నీరజ్ అప్పుడు కూడా స్వర్ణం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. కాగా, పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అప్పట్లో వైరల్ అయ్యింది.