Prithvi Shaw : రీ ఎంట్రీ ఇస్తాడ‌నుకుంటే.. మ‌ళ్లీ గాయ‌ప‌డ్డాడు.. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో..!

మొద‌టి సారి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్న భార‌త యువ ఓపెన‌ర్ పృథ్వీ షా అద‌ర‌గొడుతున్నాడు. రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న షా.. ఓ ద్విశ‌త‌కం, ఓ సెంచ‌రీతో దుమ్మురేపాడు.

Prithvi Shaw : రీ ఎంట్రీ ఇస్తాడ‌నుకుంటే.. మ‌ళ్లీ గాయ‌ప‌డ్డాడు.. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో..!

Prithvi Shaw

Prithvi Shaw knee injury : మొద‌టి సారి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్న భార‌త యువ ఓపెన‌ర్ పృథ్వీ షా (Prithvi Shaw) అద‌ర‌గొడుతున్నాడు. రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న షా.. ఓ ద్విశ‌త‌కం, ఓ సెంచ‌రీతో దుమ్మురేపాడు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న ఈ యువ ఆట‌గాడు ఇక భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డమే త‌రువాయి అని అభిమానులు భావిస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డి టోర్నీ మొత్తానికే దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ నార్తంప్ట‌న్‌షైర్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడని తెలిపింది. అత‌డి మోకాలికి గాయ‌మైంది. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌డు ఈ టోర్ని నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డించింది. షా లేని లోటు పూడ్చ‌లేనిద‌ని, అత‌డు దూరం అవ్వ‌డం ఎంతో బాధిస్తోందని చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు షా రాయ‌ల్ క‌ప్‌లో నాలుగు మ్యాచులు ఆడి 429 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం టోర్నీ టాప్ స్కోర‌ర్ అత‌డే.

Ben Stokes : ప్ర‌పంచ‌క‌ప్ ముందు బెన్‌స్టోక్స్ కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు షాక్ త‌ప్ప‌దా..!

నార్తంప్ట‌న్‌షైర్ త‌రుపున షా త‌క్కువ మ్యాచులే ఆడిన‌ప్ప‌టికీ అత‌డు తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపించాడ‌ని ఆ జ‌ట్టు కోచ్ జాన్ సాడ్ల‌ర్ తెలిపాడు. బీసీసీఐ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో లండ‌న్‌లోని స్పెలిస్ట్ డాక్ట‌ర్ల వ‌ద్ద షా చికిత్స చేయించుకోనున్నాడు.

గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో బాధ‌ప‌డుతున్న పృథ్వీ షా ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్ 2023 సీజ‌న్‌లోనూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాల‌ని అత‌డు నిర్ణ‌యం తీసుకున్నాడు. రాయ‌ల్ లండ‌న్ వ‌న్డే క‌ప్‌తో కౌంటీల్లో అడుగుపెట్టాడు. నార్తంప్టన్‌షైర్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న షా.. మొద‌టి రెండు మ్యాచుల్లో క‌లిపి 60 ప‌రుగులే చేశాడు. అయితే.. ఆగ‌స్టు 9న సోమ‌ర్ సెట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా డ‌బుల్ సెంచ‌రీతో దుమ్ములేపాడు.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ టికెల్ కావాలా.. ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

ఆ త‌రువాత ఆగ‌స్టు 13న డ‌ర్హ‌మ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 76 బంతుల్లో 125 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి జట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లోనే షా గాయ‌ప‌డ్డాడు. విధ్వంస‌క‌ర ఆట‌తీరుతో భార‌త జ‌ట్టు సెల‌క్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించాడు. ఇక షా టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ప‌క్కా అని అభిమానులు ఫిక్సైయ్యారు. అయితే.. అంత‌లోనే అత‌డు గాయప‌డ్డాడు. దీంతో ఫ్యాన్స్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి.