Ravichandran Ashwin: అశ్విన్‌కు ఆరు వికెట్లు.. 69 పరుగులకే ఆలౌట్

ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లండన్‌లోని కియా ఓవల్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.

Ravichandran Ashwin: అశ్విన్‌కు ఆరు వికెట్లు.. 69 పరుగులకే ఆలౌట్

Aswin

Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లండన్‌లోని కియా ఓవల్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సోమెర్‌సెట్‌పై ఆరు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్‌ డేనియల్ మోరియార్టీ తోడవ్వడంతో సోమర్‌సెట్‌ 69 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సోమర్‌సెట్‌, తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకం చెయ్యగా.. సోమర్‌సెట్‌ ప్లేయర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసిం సోమర్ సెట్. సర్రే బౌలర్లు జోర్డాన్‌ క్లార్క్‌, అమర్‌ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్‌ మోరియార్టీ 2, అశ్విన్‌, ఆర్‌ క్లార్క్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్‌(50), స్టోన్‌మెన్‌(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకు ఆలౌటైంది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సోమర్‌సెట్ బ్యాట్స్‌మన్‌‌లు అశ్విన్ దాటికి వరుసగా పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో జె హిల్డ్రెత్ (14) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్ 15 ఓవర్లలో 27 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. సర్రే గెలవడానికి 259 పరుగులు చేయాల్సి ఉండగా.. 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్‌ ఆమ్లా(24), జేమీ స్మిత్‌(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది.