Rishabh Pant: రిషబ్ పంత్‌ను ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కు మార్చిన డాక్టర్లు.. సందర్శకుల తాకిడితో విశ్రాంతి కరువైన పంత్

ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్‌ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ప్రకటించారు.

Rishabh Pant: రిషబ్ పంత్‌ను ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కు మార్చిన డాక్టర్లు.. సందర్శకుల తాకిడితో విశ్రాంతి కరువైన పంత్

Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తాజాగా అతడ్ని వైద్యులు ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కు తరలించారు. ఇన్ఫెక్షన్ సోకకూడదనే ఉద్దేశంతోనే డాక్టర్లు ఈ చర్య తీసుకున్నట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్‌ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ప్రకటించారు. ఆదివారం పుష్కర్ సింగ్ ధామి ఆస్పత్రిలో పంత్‌ను పరామర్శించారు. కాగా, పంత్ చికిత్స విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలతో బీసీసీఐ చర్చించింది. పంత్ నుదురు, కుడి మోకాలు, కాలి లిగ్మెంట్ వద్ద గాయాలయ్యాయి. అవసరమైతే ఈ గాయాలకు చికిత్స కోసం పంత్‌ను విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు పంత్‌ను పరామర్శించేందుకు వీఐపీలు ఎక్కువగా వస్తున్నారు. దీంతో అతడు విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదని పంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం

వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు, క్రీడాకారులు, అధికారులు, నటులు వస్తుండటంతో అతడికి విశ్రాంతి కరువైందని పంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. అది కూడా సందర్శన వేళలతో సంబంధం లేకుండా పంత్‌ను పరామర్శించేందుకు వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలంటే అతడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అతడు గాయాల వల్ల కలిగిన నొప్పితో బాధ పడుతున్నాడని, సందర్శకులతో మాట్లాడటం వల్ల అతడు చాలా శక్తిని కోల్పోవాల్సి వస్తోందని, మరింత ఒత్తిడికి గురవుతున్నాడని వైద్యులు చెప్పారు.