Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్

ఇండియా క్రికెట్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు కొట్టేశాడు. హర్యానాకు చెందిన క్రికెటర్ మృణాంక్ సింగ్ మరో వ్యాపారిని మోసం చేసి దొరికిపోగా ఈ విషయం బయటపడింది. రిషబ్ మేనేజర్ పునీత్ సోలంకి తమ నుంచి కోటి 63లక్షల రూపాయలు కాజేశాడంటూ ఫిబ్రవరిలోనే కేసు పెట్టారు.

Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్

Rishab Pant

Rishabh Pant: ఇండియా క్రికెట్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు కొట్టేశాడు. హర్యానాకు చెందిన క్రికెటర్ మృణాంక్ సింగ్ మరో వ్యాపారిని మోసం చేసి దొరికిపోగా ఈ విషయం బయటపడింది. రిషబ్ మేనేజర్ పునీత్ సోలంకి తమ నుంచి కోటి 63లక్షల రూపాయలు కాజేశాడంటూ ఫిబ్రవరిలోనే కేసు పెట్టారు.

నగరానికి చెందిన వ్యాపారవేత్తను రూ. 6 లక్షల మోసం చేశారనే ఆరోపణలపై జుహు పోలీసులు మే నెలారంభంలో సింగ్‌ను అరెస్టు చేయగా, హాజరుపరచాలని సాకేత్ కోర్టు గత వారం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు నోటీసు జారీ చేసింది. పంత్ ఒక ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచింగ్ సిరీస్ వాచ్‌ని కొనుగోలు చేయాలని అతణ్ని సంప్రదించాడు. క్రేజీ కలర్ వాచ్ కోసం రూ. 36లక్షల 25వేల 120చెల్లించి.. రిచర్డ్ మిల్లే వాచ్ కోసం రూ. 62,60,000 చెల్లించాడు.

సింగ్ తనను మోసం చేశాడని పంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాచీల ఖర్చుపై సమాచారాన్ని జోడించి రూ.1.63 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించాడు.

Read Also: “పంత్.. ధోనీ నుంచి నేర్చుకోగలడు.. అతనిలా చేయలేడు”

“జనవరి 2021లో మృణాంక్.. పంత్, సోలంకీలకు విలాసవంతమైన గడియారాలు, బ్యాగులు, ఆభరణాలు మొదలైనవాటిని కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించానని నమ్మించాడు. లగ్జరీ వాచీలు, ఇతర వస్తువులు మంచి డిస్కౌంట్, చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చని పంత్, అతని మేనేజర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చాడు” అని ఫిర్యాదులో నమోదైంది.

“నిందితుడి మాటలు నమ్మి, పంత్ అరవై ఐదు లక్షల డెబ్బై వేల ఏడు వందల ముప్పై రూపాయలకి కొనుగోలు చేసిన విలాసవంతమైన వాచ్, కొన్ని నగల వస్తువులను ఫిబ్రవరి 2021 నెలలో నిందితుడికి అప్పగించాడు. ఒకటి మాత్రమే రీసేల్ చేసినట్లు ” ఫిర్యాదులో పేర్కొన్నారు.