ఏడేళ్లుగా కోహ్లీ కంటే రో’హిటే’ టాప్

ఏడేళ్లుగా కోహ్లీ కంటే రో’హిటే’ టాప్

పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగైన రికార్డును సాధించాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ సంవత్సరం మాత్రమే కాదు వరుసగా ఏడో ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో ఇటీవల వైజాగ్‌లో ఆడిన రెండో వన్డేలో 159పరుగుల స్కోరుతో చెలరేగిపోయాడు. కటక్ లోని బరాబతి స్టేడియంలో జరిగిన డిసైడింగ్ మ్యాచ్‌లోనూ 63పరుగులు చేసి మెప్పించాడు. 316 పరుగుల చేధనలో దిగిన భారత జట్టులో హైస్కోరర్ గా నిలవడంతో పాటు 2019లో అత్యధిక పరుగులుచేసిన ప్లేయర్ గా నిలిచాడు. 

ఈ ఏడాది 28వన్డేలు ఆడిన రోహిత్ 1వెయ్యి 490పరుగులు చేశాడు. అదే కోహ్లీ 26మ్యాచ్ లు ఆడి 1వెయ్యి 377పరుగులు పూర్తి చేశాడు. ఈ వరుసలో మూడో స్థానంలో విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్ 1వెయ్యి 345పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌ల బ్రిలియంట్ ప్రదర్శన అనంతరం భారత్.. వెస్టిండీస్‌ను 4వికెట్ల తేడాతో ఓడించగలిగింది. ఫలితంగా భారత్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం చాలా అద్భుతంగా గడిచింది. వరల్డ్ కప్ విజయం సాధించి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఓ జట్టుగా సంవత్సరమంతా చాలా బాగా ఆడాం. రెడ్ బాల్, వైట్ బాల్ అనేది లేకుండా కలిసి కష్టపడ్డాం. వ్యక్తిగతంగా నేను బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాను. ఇది ఎన్నటికీ ఆపను. వచ్చే సంవత్సరం మరింత ఎగ్జైటింగ్‌గా ఉంటుంది అనుకుంటున్నాను’ అని రోహిత్ తెలిపాడు. 

వీటితో పాటు వరుసగా ఏడో సంవత్సరం రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరుతో నిలిచాడు. 2019లో 159పరుగులు చేసి ఏడాదికి అధిక వ్యక్తిగత పరుగులు భారత బ్యాట్స్‌మన్‌గా  ఘనత సాధించాడు. 

2013 నుంచి వ్యక్తిగత హై స్కోరు వివరాలు:

2013: రోహిత్ శర్మ  (209)
2014: రోహిత్ శర్మ  (264)
2015: రోహిత్ శర్మ  (150)
2016: రోహిత్ శర్మ  (171*)
2017: రోహిత్ శర్మ  (208*)
2018: రోహిత్ శర్మ (162)

ఈ క్రమంలో రోహిత్ శర్మ శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 22ఏళ్ల రికార్డును సైతం బద్దలుకొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అధిక అంతర్జాతీయ పరుగులు 
చేసిన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ కేవలం 9పరుగులు లభిస్తే చాలు.