Danish Kaneria Sensational Allegations : నేను హిందువుని కావడంతో అఫ్రిది విపరీతంగా ద్వేషించే వాడు- మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని వాపోయాడు. అంతేకాదు, దేశంలో నాకు చోటు లేదని..(Danish Kaneria Sensational Allegations)

Danish Kaneria Sensational Allegations : నేను హిందువుని కావడంతో అఫ్రిది విపరీతంగా ద్వేషించే వాడు- మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Danish Kaneria

Danish Kaneria Sensational Allegations : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్నిన్నర్ డానిష్ కనేరియా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో పాకిస్తాన్ జట్టులో పరిస్థితి ఎలా ఉండేదో వివరిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యవహార శైలిపై సంచలన ఆరోపణలు చేశాడు. తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని కనేరియా వాపోయాడు. అంతేకాదు, పాకిస్తాన్ దేశంలో నాకు చోటు లేదని, నన్ను జట్టు నుంచి బహిష్కరించాలని ఇతర ఆటగాళ్లకు కూడా నూరిపోసేవాడు అని కనేరియా ఆరోపించాడు.

”అఫ్రిది క్యారెక్టర్ లేని వాడని నాకు తెలుసు. అందుకే అతడి మాటలు పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవాడిని. ఏదేమైనా, జట్టులో ఉన్నంతకాలం అఫ్రిది నన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు. అతడికి ఎందుకంత కడుపు మంట అనేది అర్థం అయ్యేది కాదు. అఫ్రిది కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకు తుది జట్టులో చోటు కల్పించేవాడు కాదు. రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసేవాడు. అఫ్రిది వంటి అబద్ధాల కోరును ఎక్కడా చూడబోము” అని కనేరియా అన్నాడు.(Danish Kaneria Sensational Allegations)

అఫ్రిదిపై గంభీర్ ఫైర్.. అతడో జోకర్..!

అయితే, పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడటాన్ని మాత్రం అదృష్టంగా భావిస్తానని, తనకు జీవితంలో లభించిన భాగ్యం అని కనేరియా చెప్పాడు. కాగా, తనపై విధించిన నిషేధంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పునఃసమీక్షించాలని, లీగ్ క్రికెట్ లో ఆడే వీలు కల్పించాలని కోరాడు. ఫిక్సింగ్ కు పాల్పడిన వాళ్లు హాయిగా తిరుగుతున్నారని, తన అంతర్జాతీయ క్రికెట్ ఎలాగూ ముగిసిపోయిందని, కనీసం టీ20 ఫ్రాంచైజీ లీగ్ పోటీల్లోనైనా ఆడేందుకు అవకాశమివ్వాలని కనేరియా విజ్ఞప్తి చేశాడు. కాగా, తాను హిందువు కావడంతో ద్వేషించేవాడు అంటూ అఫ్రిది గురించి కనేరియా చేసిన ఆరోపణలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆటగాళ్ల మధ్య లుకలుకలు, జట్టులో గ్రూపులు, దీనికి తోడు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు.. ఇవన్నీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రతిష్ఠను మసకబార్చాయి. మహ్మద్ అమీర్, సల్మాన్ భట్ వంటి ప్రతిభావంతులు అవినీతి కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురయ్యాడు.(Danish Kaneria Sensational Allegations)

కనేరియా 2000 సంవత్సరంలో పాక్ జట్టులో స్థానం సంపాదించాడు. కెరీర్ లో 61 టెస్టులాడిన అతడు 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. కాగా, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో కనేరియాపై వేటు వేడింది. జీవిత కాలం నిషేధం విధించారు.

కశ్మీర్‌ మాతోనే ఉంటుంది : అఫ్రిదిపై ధావన్ ఫైర్

2012లో ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రో-లీగ్ మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రెండు ఆరోపణలపై ఇంగ్లిష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) డానిష్ కనేరియాను అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసింది.