మహిళల ఐపీఎల్: కొత్త ఛాంపియన్.. ట్రైల్‌బ్లేజర్స్‌దే టైటిల్

  • Published By: vamsi ,Published On : November 10, 2020 / 08:48 AM IST
మహిళల ఐపీఎల్: కొత్త ఛాంపియన్.. ట్రైల్‌బ్లేజర్స్‌దే టైటిల్

మహిళల టి 20 ఛాలెంజ్ మూడవ సంవత్సరంలో కొత్త ఛాంపియన్‌ అవతరించింది. మినీ ఉమెన్స్ ఐపిఎల్ అని పిలువబడే మహిళల టి20 ఛాలెంజ్ ఫైనల్‌లో ట్రైల్ బ్లేజర్స్ సూపర్‌నోవాస్‌పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్నోవాస్‌ను స్మృతి మంధనా నేతృత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ ఓడించింది. మునుపటి రెండు సీజన్లను సూపర్‌నోవాస్‌ గెలుచుకోగా.. ఈ సీజన్‌లో మాత్రం కొత్త ఛాంపియన్లుగా ట్రైల్ బ్లేజర్స్ అవతరించారు. సూపర్నోవాస్‌ను 16 పరుగుల తేడాతో ఓడించారు.



ఉమెన్స్ టి20 ఛాలెంజ్ 2020 చివరి మ్యాచ్ నవంబర్ 9న సోమవారం షార్జాలోని మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్నోవాస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ట్రైల్ బ్లేజర్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ట్రైల్‌బ్లేజర్స్ తరఫున కెప్టెన్ స్మృతి మంధనా 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసింది. డియాంద్ర డాటిన్ 32 బంతుల్లో 20 పరుగులు చేయగా, రిచా ఘోష్ 10 పరుగులు చేసింది.



సూపర్‌నోవాస్‌ జట్టు తరపున రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయగా.. పూనమ్ యాదవ్, శశికళ సిరివర్ధనే చెరో వికెట్ తీసుకున్నారు. 119 పరుగులు చేజింగ్‌తో బరిలోకి దిగిన సూపర్‌నోవాస్‌కు మంచి ఆరంభం లభించకపోగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మ్యాచ్‌లో పరుగులు తీసే సమయంలో గాయపడింది.



https://10tv.in/legendary-cricketer-kapil-dev-and-actress-rajisha-vijayan-participated-green-india-challenge/
ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 పరుగులు మాత్రమే చేయగా, శశికళ సిరివర్ధనే 19, తాన్య భాటియా 14, జెమిమా రోడ్రిగ్స్ 13 పరుగులు చేశారు. 119 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని సూపర్ నోవాస్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 రన్స్ మాత్రమే చేసింది. ట్రైల్ బ్లేజర్స్ తరపున సల్మా ఖాటూన్ 3 వికెట్లు తీసుకుంది. గతేడాది సూపర్నోవాస్ వెలాసిటీని ఓడించి టైటిల్ గెలుచుకుంది, కాని ఈసారి సూపర్నోవాస్ ఫైనల్స్‌లో మరియు మహిళల టి 20 ఛాలెంజ్‌లో కొత్త ఛాంపియన్ ట్రైల్బ్లేజర్స్‌గా ఓడిపోయింది.