Jai Shree Ram: భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత “జై శ్రీరామ్” అంటున్న సౌతాఫ్రికా బౌలర్

దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త సంవత్సరం స్టార్టింగ్‌లోనే మంచి కిక్ ఇచ్చింది.

Jai Shree Ram: భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత “జై శ్రీరామ్” అంటున్న సౌతాఫ్రికా బౌలర్

South Africa

Ind vs SA: దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త సంవత్సరం స్టార్టింగ్‌లోనే మంచి కిక్ ఇచ్చింది. మొదట డీన్ ఎల్గర్ నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికన్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో బావుమా జట్టు భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

ఈ చిరస్మరనీయ విజయం గురించి “జై శ్రీరామ్” అనే నినాదంతో సౌతాఫ్రికా లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. పోస్ట్ చివరలో, అతను జై శ్రీరామ్ అని రాయడం ఆసక్తికరం. ఈ మాట ఇప్పుడు భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

మహారాజ్ దక్షిణాఫ్రికా జట్టు చిత్రాలను షేర్ చేసి, ‘ఇది మాకు చాలా గొప్ప సిరీస్. మా టీమ్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మనం ఎంత దూరం వచ్చాము అనేది కాదు.. ఎంత దూరం వెళ్లాలి అనేది ఇప్పుడు మాకు ముఖ్యం.. ఇది సరైన సమయం మేం మళ్లీ రీఛార్జ్ అవ్వడానికి’ “జై శ్రీరామ్” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో భారతీయ హిందువులు అనేకమంది జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Keshav Maharaj (@keshavmaharaj16)

వన్డే సిరీస్‌లో కేశవ్ మహరాజ్ చాలా మంచి ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక వికెట్లు తీశాడు. తొలి వన్డేలో శిఖర్ ధావన్‌ను పెవిలియన్‌కు పంపగా, ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ తడబడింది. అదే సమయంలో, మిగిలిన రెండు మ్యాచ్‌లలో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు కేశవ్ మహారాజ్.

కేశవ్ మహారాజ్ పూర్వీకులు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కేశవ్ తండ్రి ఆత్మానంద మహారాజ్ తన పూర్వీకులు 1874లో సుల్తాన్‌పూర్ నుంచి డర్బన్‌కు వెళ్లిపోయారు.