Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ సంచలనంగా మారింది. స్టార్క్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తుండగా పట్టిన క్యాచ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Steve Smith: విశాఖపట్నం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ సంచలనంగా మారింది. ఈ వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 26 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసి, ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బ్యాటింగ్‌కు సంబంధించి హార్ధిక్ పాండ్యా ఔటవ్వడానికి కారణం స్మిత్ పట్టిన అద్భుత క్యాచ్. స్టార్క్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టార్క్ వేసిన బంతి, పాండ్యా బ్యాట్‌కు తగిలి, స్లిప్స్‌లో ఉన్న స్మిత్ వైపు వెళ్లింది. అయితే, బంతి స్మిత్‌కు చాలా దూరంలో పడబోయింది. కానీ, స్మిత్ అంత దూరం అద్భుతంగా జంప్ చేసి మరీ క్యాచ్ పట్టుకున్నాడు. కుడి వైపు దూరంగా వెళ్తున్న బంతిని స్మిత్ గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి పాండ్యా, రోహిత్ శర్మతోపాటు ఆటగాళ్లు, ప్రేక్షకులు షాకయ్యారు.
Video Games: అదేపనిగా మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?
స్మిత్ క్యాచ్ పట్టిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ క్యాచ్‌పై పలువురు ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా భారత మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ స్మిత్‌ను అభినందించాడు. స్మిత్ పట్టిన క్యాచ్‌ను ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’గా అభివర్ణించాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా జహీర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. సంజయ్ మంజ్రేకర్ కూడా స్మిత్‌ను అభినందించాడు.
#SteveSmith catch of century Smithy you beauty 🔥🔥 pic.twitter.com/LQkuNvNQJO
— Zaheer Khan (@ZaheerK30866428) March 19, 2023