హాస్పిటల్‌లో చేరిన సన్‌రైజర్స్ కెప్టెన్

హాస్పిటల్‌లో చేరిన సన్‌రైజర్స్ కెప్టెన్

న్యూజిలాండ్ జట్టు కెప్టెన్, 2018 ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాస్పిటల్‌లో చేరాడు. అతని భుజానికి గాయం కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసిన మెడికల్ సిబ్బంది హాస్పిటిల్‌కు చేర్చారు. బంగ్లాదేశ్ జట్టుతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఆడుతోంది. ఇందులో భాగంగానే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఎడమ భుజం నొప్పితో బాధపడుతూ పంటి బిగువ బాధ పెట్టుకుని ఆడుతున్నాడు. 
Read Also : సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్: రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టిక్కెట్లు

నొప్పి తీవ్రమైంది తన వల్ల కాలేదు.. మెడికల్ సిబ్బందిని సహాయం అడిగాడు. ప్రథమ చికిత్స్ చేసిన వారు.. అనుమానంతోనే హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అప్పటికే తన 30వ టెస్టు హాఫ్ సెంచరీ సాధించిన విలియమ్సన్ ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్నాడు. 

కేన్ విలియమ్సన్ ఆరోగ్యంపైన సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను ఆశించిన దానికంటే టాప్‌లో ఉంచడమే కాకుండా.. ఫైనల్ వరకూ తీసుకెళ్లిన విలియమ్సన్ కెప్టెన్సీపై అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. 
Read Also : ఈ సారి ఐపీఎల్ జరిగేది పాకిస్తాన్‌లో..: పాక్ క్రికెటర్