Suryakumar Yadav: ఐపీఎల్‌లో తొలి సెంచ‌రీ చేసిన సూర్య‌కుమార్‌.. టీ20 క్రికెట్‌లో ఎన్నోదంటే..?

గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సూర్య‌కుమార్ యాద‌వ్ విధ్వంసం సృష్టించిన వేళ ముంబైలోని వాంఖ‌డే స్టేడియం స్కై నామ‌స్మ‌ర‌ణ‌తో మారు మోగిపోయింది. త‌న‌దైన శైలిలో ప‌రుగుల వ‌ర‌ద పారించి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు సూర్య‌కుమార్.

Suryakumar Yadav: ఐపీఎల్‌లో తొలి సెంచ‌రీ చేసిన సూర్య‌కుమార్‌.. టీ20 క్రికెట్‌లో ఎన్నోదంటే..?

Suryakumar Maiden IPL Century

Suryakumar Yadav Maiden IPL Century: గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) విధ్వంసం సృష్టించిన వేళ ముంబైలోని వాంఖ‌డే స్టేడియం స్కై నామ‌స్మ‌ర‌ణ‌తో మారు మోగిపోయింది. 360 డిగ్రీల‌లో షాట్లు కొడుతూ ఫీల్డ‌ర్ల‌ను ప్రేక్ష‌క పాత్ర‌కే ప‌రిమితం చేసిన సూర్య వీర‌విహారాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము. బంతి ప‌డిందా బౌండ‌రీ దాటిందా అన్నంత‌గా స్కై త‌న‌దైన శైలిలో ప‌రుగుల వ‌ర‌ద పారించి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు.

IPL 2023: రోహిత్, కోహ్లి టీ20 క్రికెట్‌కు దూరమైన‌ట్లే

ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా లెక్క‌చేయ‌కుండా త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ చివ‌రి బంతికి సిక్స్‌తో శ‌త‌కాన్ని అందుకున్నాడు సూర్య‌. కేవ‌లం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులతో అజేయంగా నిలిచిన సూర్య‌కుమార్ ముంబై త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగానూ రికార్డు నెల‌కొల్పాడు. అంతేకాదు గుజ‌రాత్ టైటాన్స్‌పై అత్య‌ధిక స్కోరు చేసిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. కాగా.. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఇది నాలుగో సెంచరీ.