IPL 2023: గుజ‌రాత్‌పై ముంబై ఘ‌న విజ‌యం

వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians)  విజ‌యం సాధించింది.

IPL 2023: గుజ‌రాత్‌పై ముంబై ఘ‌న విజ‌యం

MI vs GT

MI vs GT: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians)  విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 12 May 2023 11:34 PM (IST)

    ముంబై ఘ‌న విజ‌యం

    ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ముంబై 27 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది

  • 12 May 2023 11:16 PM (IST)

    దంచికొడుతున్న ర‌షీద్ ఖాన్‌.. 21 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం

    ఓ వైపు వికెట్లు ప‌డ్డ‌ప్ప‌టికి ర‌షీద్ ఖాన్ మాత్రం ధాటిగా ఆడుతున్నాడు. గ్రీన్ బౌలింగ్‌లో(17.4వ ఓవ‌ర్‌) సిక్స్‌తో 21 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు

  • 12 May 2023 11:04 PM (IST)

    ధాటిగా ఆడుతున్న ర‌షీద్ ఖాన్‌

    కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో నూర్ అహ్మ‌ద్(1) క్లీన్ బౌల్డ్ కావ‌డంతో గుజ‌రాత్ 103 ప‌రుగుల(13.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అయితే.. ర‌షీద్ ఖాన్ ధాటిగా ఆడుతున్నాడు. 16 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 136/8. ర‌షీద్ ఖాన్‌(26), అల్జారీ జోసెఫ్(7) క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 10:46 PM (IST)

    వ‌రుస బంతుల్లో మిల్ల‌ర్‌, తెవాటియా ఔట్‌

    గుజ‌రాత్ జ‌ట్టు వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 11వ ఓవ‌ర్ చివ‌రి బంతికి ఆకాష్ మధ్వల్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్ (41) ఎల్భీగా ఔట్ కాగా.. 12వ ఓవ‌ర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా(14) పీయూష్ చావ్లా బౌలింగ్‌లో గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో 100 ప‌రుగుల‌కే గుజ‌రాత్ ఏడు వికెట్లు కోల్పోయింది.

  • 12 May 2023 10:33 PM (IST)

    స‌గం ఓవ‌ర్లు పూర్తి

    గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు ముగిశాయి. 10 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 82/5. రాహుల్ తెవాటియా(6), మిల్ల‌ర్‌(31)లు క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 10:26 PM (IST)

    స‌గం వికెట్లు కోల్పోయిన గుజ‌రాత్

    గుజ‌రాత్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతోంది. కార్తికేయ వేసిన 7.1 బంతికి అభిన‌వ్ మ‌నోహ‌ర్‌(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజ‌రాత్ 55 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది.

  • 12 May 2023 10:12 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన గుజ‌రాత్‌కు ముంబై బౌల‌ర్లు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. సాహా (2), గిల్ (6), హార్ధిక్ పాండ్యా (4) లు ఔట్ అయ్యారు. ప‌వ‌ర్ ప్లే ముగిసింది. 6 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 48/3. విజ‌య్ శంక‌ర్‌(29), డేవిడ్ మిల్ల‌ర్‌(5)లు క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 09:22 PM (IST)

    గుజ‌రాత్ ల‌క్ష్యం 219

    వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ విధ్వంసం సృష్టించాడు. సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో ఇషాన్ కిష‌న్‌(31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌). విష్ణు వినోద్‌(30; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఇష‌న్ కిష‌న్‌(31; 20బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయ‌గా మోహిత్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 12 May 2023 09:03 PM (IST)

    సూర్య‌కుమార్ యాద‌వ్ అర్ధ‌శ‌త‌కం.. టిమ్ డేవిడ్ ఔట్‌

    ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన సూర్య‌కుమార్ యాద‌వ్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఆఖరి బంతికి టిమ్ డేవిడ్(5) ఔట్ అయ్యాడు.17 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 164/5. సూర్య‌కుమార్ యాద‌వ్‌(53) క్రీజులో ఉన్నాడు.

  • 12 May 2023 09:00 PM (IST)

    విష్ణు వినోద్ ఔట్

    మోహిత్ శ‌ర్మ బౌలింగ్‌లో మ‌నోహ‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో విష్ణు వినోద్(30) ఔట్ అయ్యాడు. దీంతో 153 ప‌రుగుల(15.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 153/4. సూర్య‌కుమార్ యాద‌వ్‌(47) క్రీజులో ఉన్నాడు.

  • 12 May 2023 08:40 PM (IST)

    13 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 131/3

    13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 131 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ 33, విష్ణు వినోద్ 22 క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 08:28 PM (IST)

    నెహాల్ వధేరా క్లీన్ బౌల్డ్

    గుజ‌రాత్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ ధాటికి ముంబై బ్యాట‌ర్లు విల‌విలలాడుతున్నారు. ర‌షీద్ బౌలింగ్‌లో నెహాల్ వధేరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 88 ప‌రుగుల వ‌ద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 88/3. సూర్య‌కుమార్ యాద‌వ్‌(5), విష్ణు వినోద్(0) క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 08:16 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబై

    ముంబై జ‌ట్టుకు ర‌షీద్ ఖాన్ గ‌ట్టి షాకిచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో ముంబై ఓపెన‌ర్లు ఇద్ద‌రిని ఔట్ చేశాడు. తొలి బంతికి రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేయ‌గా ఐదో బంతికి ఎల్భీగా ఇషాన్ కిష‌న్ ను పెవిలియ‌న్‌ చేర్చాడు. దీంతో 66 ప‌రుగుల వ‌ద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 66/2. సూర్య‌కుమార్ యాద‌వ్‌(5), నెహాల్ వధేరా(0) క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 08:12 PM (IST)

    రోహిత్ ఔట్‌

    ముంబై వికెట్ కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ‌(29) తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 61 ప‌రుగుల(6.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 12 May 2023 07:50 PM (IST)

    17 ప‌రుగులు

    ముంబై ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌లు దూకుడుగా ఆడుతున్నాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన మూడో ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి బంతికి ఇషాన్ కిష‌న్, ఆఖ‌రి బంతికి రోహిత్ సిక్స్‌లు కొట్టారు. 3 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 37/0. రోహిత్ శ‌ర్మ‌(21), ఇషాన్ కిష‌న్‌(15) క్రీజులో ఉన్నారు.

  • 12 May 2023 07:12 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ తుదిజ‌ట్టు

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్

  • 12 May 2023 07:10 PM (IST)

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ

  • 12 May 2023 07:09 PM (IST)

    టాస్ గెలిచిన గుజ‌రాత్

    టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఇరు జ‌ట్ల కూడా త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేవు. గ‌త మ్యాచ్‌లో ఆడిన జ‌ట్ల‌తోనే ఆడుతున్నాయి.