T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12లో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం

T20 World Cup 2021 New Zealand

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12లో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన టార్గెట్ ను స్కాట్లాండ్ చేజ్ చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో మైఖెల్ లీయాస్క్ 42 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సోదీ 2, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు.

Gmail Account : గూగుల్ కొత్త రూల్స్.. ఇకపై మీ జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇది మస్ట్!

స్కాట్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ కైల్‌ కోట్జర్‌ (17) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మాథ్యూ క్రాస్‌ (27)తో కలిసి.. జార్జ్‌ మున్సీ (22) నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే ఇష్‌ సోదీ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రీజులో జార్జ్‌ మున్సీ ఔటయ్యాడు. కొద్ది సేపటికే క్రాస్‌ కూడా.. బౌల్డై క్రీజు వీడాడు. దీంతో 11 ఓవర్లకు స్కాట్లాండ్‌ 77 పరుగులతో నిలిచింది. అయితే, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్‌ లాయిడ్ (17), రిచీ బెర్రింగ్టన్‌ (20) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో వచ్చిన మైఖేల్ లియాస్క్‌ (42*) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బ్యాటర్లలో మార్టిన్‌ గప్తిల్ ( 56 బంతుల్లో 93 పరుగులు.. 7 సిక్సులు, 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. గ్లెన్‌ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌ 2, బ్రాడ్లే వీల్‌ 2, మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తీశారు.