T20 World Cup : సూపర్ 12కు అర్హత సాధించిన 4 జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు 4 జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు.. సూపర్-12లో టాప్ టీమ్స్ తో పోటీ పడనున్నాయి.

T20 World Cup
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు 4 జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు.. సూపర్-12లో టాప్ టీమ్స్ తో పోటీ పడనున్నాయి. శ్రీలంక, స్కాట్లాండ్ 3 విజయాలతో తమ గ్రూపుల్లో టాప్ లో నిలవగా.. బంగ్లాదేశ్, నమీబియా రెండేసి విజయాలు సాధించాయి. భారత్ ఉన్న గ్రూప్ లోకి చేరిన స్కాట్లాండ్, నమీబియా.. సంచలనాలు నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 షురూ కానుంది.
Soaps: మీరు వాడుతున్న సబ్బు మంచిదేనా?
టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ మెగా టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ కూడా తన అంచనాను బయటపెట్టాడు. టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ విజేతగా నిలిచేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. మరో వైపు, ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ఏ విధంగానూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించాడు. పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల నుంచి మిగతా జట్లు గట్టి పోటీని ఎదుర్కొంటాయని వార్న్ అన్నాడు.
Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే?
‘ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ బరిలో నిలుస్తాయని అనుకుంటున్నా. ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఆ జట్టులో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని షేన్ వార్న్ ట్వీట్ చేశాడు. ఇక, టీమిండియా విషయానికొస్తే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచుల్లో విజయాలు సాధించి జోరు మీదుంది. ఆదివారం (అక్టోబరు 24)న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.