T20 World Cup 2021: టీమిండియా బలహీనతలు ఎత్తి చూపిన సచిన్ టెండూల్కర్

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రెస్పాండ్ అయ్యారు. గేమ్ ను తన కోణంలో విశ్లేషించిన ఆయన.. ప్రస్తుతం టీమిండియా లెగ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతుందన్నారు.

T20 World Cup 2021: టీమిండియా బలహీనతలు ఎత్తి చూపిన సచిన్ టెండూల్కర్

Sachin Analysis

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ తో తలపడి 8వికెట్ల తేడాతో ఓడిపోవడంతో సెమీస్ ఆశలు చేజార్చుకుంది టీమిండియా. ఆరంభ మ్యాచ్ పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన కోహ్లీసేన.. రెండో మ్యాచ్ లోనూ కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆ రెండు జట్లు టాప్ లోకి చేరుకోగా టీమిండియా పోరు నామమాత్రంగా మారింది.

న్యూజిలాండ్ తో మ్యాచ్ లలో న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 2/17తో చక్కగా ఆడాడు. రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ(9) లాంటి బడా వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు. టాపార్డర్ కుదేలవడంతో జట్టు అత్యల్ప స్కోరుకే పరిమితమై చేధనలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయలేకపోయింది.

దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రెస్పాండ్ అయ్యారు. గేమ్ ను తన కోణంలో విశ్లేషించిన ఆయన.. ప్రస్తుతం టీమిండియా లెగ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతుందన్నారు.

,……………………………: విరాట్ పది నెలల కూతురిపై కామెంట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి – మహిళా సంఘాలు

‘నేనొక విషయం గమనించాను. లెగ్ స్పిన్నర్లు..మిక్సింగ్ చేసి గుగ్లీలు, టాప్ స్పిన్, ఫ్లిప్పర్, నార్మల్ లెగ్ స్పిన్ లతో టీమిండియాపై సక్సెస్ సాధిస్తున్నారు. ఇష్ సోధీ చాలా ప్రభావవంతంగా కనిపించాడు. మరోవైపు శాంతర్ కూడా బాగా ఆడాడు. ఇద్దరూ ఎనిమిది ఓవర్లకు 32పరుగులు మాత్రమే ఇచ్చారు. గేమ్ పై చాలా ప్రభావం కనిపిస్తుంది. ఈ పాయింట్ లో మనం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది’

‘చేధనలో తొలి ఆరు ఓవర్లలో కనీసం మూడు వికెట్ల వరకూ పడగొట్టాలి. ఎక్కువ పరుగులు ఇవ్వకపోవడం మంచిది. బుమ్రా ఒక్కడే ఒక్క వికెట్ పడగొట్టాడు. అదేం ప్రభావం చూపించలేకపోయింది. వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ బౌలర్ తో మొదలుపెట్టాం. ఓపెనర్ల వికెట్లు తీయాలని అనుకున్నా వర్కౌట్ కాలేదు’ అని సచిన్ టెండూల్కర్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

కోహ్లీసేన తన తర్వాతి మ్యాచ్ ను అఫ్ఘనిస్తాన్ తో నవంబర్ 3వ తేదీ బుధవారం ఆడనుంది. జాయేద్ స్టేడియం వేదికగా సాయంత్రం 7గంటల 30నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది.