WTC Final 2023: ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ ఫార్మాట్‌లో 106 సార్లు తలపడ్డ భారత్.. ఎవరెన్ని సార్లు గెలిచారో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్‌ మైదానంలో భారత్ జట్టు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వీటిల్లో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి

WTC Final 2023: ఆస్ట్రేలియా జట్టుతో టెస్ట్ ఫార్మాట్‌లో 106 సార్లు తలపడ్డ భారత్.. ఎవరెన్ని సార్లు గెలిచారో తెలుసా?

WTC Final 2023

WTC Final 2023 – IND vs AUS : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ (WTC Final ) మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌ జరుగుతుంది. ఇవాళ (7వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమ్ ఇండియా (Team India), ఆస్ట్రేలియా (Australia) జ‌ట్లు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు మ్యాచ్ గెలిచేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకున్నాయి.

WTC Final 2023: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద‌తో భార‌త్‌, ఆస్ట్రేలియా కెప్టెన్లు

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఇప్పటి వరకు 106 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. విజయాల్లో ఆస్ట్రేలియా జట్టుదే పైచేయిగా ఉంది. 106 మ్యాచ్‌లలో 44 సార్లు ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 32 సార్లు భారత్ జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్ లుడ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రెండు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో భారత్ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

WTC Final 2023:ఈ సీనియ‌ర్ ఆట‌గాడు సెంచ‌రీ చేస్తే.. గెలుపు టీమ్ఇండియాదే.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లోనూ శ‌త‌కం చేస్తేనా..!

ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్‌లో భారత్ జట్టు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వీటిల్లో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇదే మైదానంలో ఆస్ట్రేలియా 38 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించగా, 17 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.