Virender Sehwag: రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు విద్యనందిస్తా

ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కులేనివారయ్యారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు.

Virender Sehwag: రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు విద్యనందిస్తా

Virender Sehwag

Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. గతంలో ఎప్పుడూ ఇంతటి భయానకమైన ప్రమాదం జరిగింది లేదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 290మందికిపైగా ప్రయాణికులు మరణించారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడటంతో పలు ఆస్పత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kollam – Chennai Egmore Express: కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పగుళ్లు.. రైల్వే సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం..

ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కులేనివారయ్యారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన విద్యార్థులకు విద్యనందించేందుకు తనవంతు సహాయం చేస్తానని చెప్పారు. ఈ మేరకు సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

 

 

ఈ విషాధ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే నేను చేయగిలిగేది. వారి చదువుల పట్ల శ్రద్ధ వహించడంలో భాగస్వామినవుతా. నేను అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్యను అందిస్తున్నాను. అని సెహ్వాగ్ ట్విటర్ వేదికగా తెలిపారు.